కృష్ణ

సమతుల ఆహారంతోనే ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, సెప్టెంబర్ 24: సమతుల్య ఆహారంతోనే మంచి ఆరోగ్య వంతులుగా ఉండవచ్చని జిల్లా కలెక్టర్ బాలయ్యనాయుడు లక్ష్మీకాంతం అన్నారు. ఎపిజెఎఫ్ కృష్ణాయూనిట్ ఆధ్వర్యంలో ఆంధ్రా ఆసుపత్రి వారి సౌజన్యంతో స్థానిక ఒసి క్లబ్‌లో నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్ట్‌లు, వారి కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రారంభించారు. అనంతరం శిబిరంలో ఇసిజి, ఎకో, కిడ్నీ పరీక్షలను పరిశీలించారు. తదుపరి ఎపిజెఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాఖమూరి మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రతి ఒక్కరూ మంచిగా ఆరోగ్యం ఉండేందుకు విలువైన సూచనలు ఇచ్చారు. జర్నలిస్ట్‌ల ఇళ్ల స్థలాల పంపిణీ విషయంపై సానుకూలంగా స్పందిస్తూ త్వరలో అందరితో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ఎపిజెఎఫ్ ఆధ్వర్యంలో ఇటువంటి మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్ట్‌ల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీకాంతంను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, యూనియన్ నేతలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు వీర్ల శ్రీరాం యాదవ్, శ్యాప్ డైరెక్టర్ బండారు హనుమంతరావు, నగర పంచాయతీ చైర్‌పర్సన్ వై పద్మావతి, డిఎస్‌పి ఉమామహేశ్వరరావు, ఇన్‌చార్జి కమీషనర్ రామకృష్ణ, కౌన్సిలర్ శాఖమూరు స్వర్ణలత, ఎన్‌సిఆర్‌సి క్లబ్ అధ్యక్షుడు చిరుమామిళ్ల చైతన్యకుమార్, చైతన్య కళాశాల అధినేత అమరనేని రమేష్‌బాబు, పట్టణ తెదేపా అద్యక్షుడు కొండూరు వెంకట్రావు, యూనియన్ నాయకులు తోట ప్రసాద్, సుభాష్, ఘంటా వీరభధ్రం, కోట రాజ, అన్నవరపు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో వంద మందికి పైగా బిపి, షుగర్, ఇసిజి, ఎకో, కిడ్నీ పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.

అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు
మైలవరం, సెప్టెంబర్ 24: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజైన ఆదివారం దుర్గాదేవి భక్తులకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ద్వారాకా తిరుమలకు దత్తత దేవాలయమైన మైలవరంలో వేంచేసియున్న శ్రీ కోట మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో, స్థానిక టాక్సీ స్టాండ్ వద్ద నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నారు. ఈసందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా టాక్సీ స్టాండ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రుల ఉత్సవాలలో పీ ఠాన్ని ఆదివారం రాష్ట్ర జలవనరుల శా ఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకుని పూజలు నిర్వహించారు. టాక్సీ స్టాండ్ ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రికి ప్రత్యేకంగా స్వాగతం పలికి అమ్మవారి ప్రసాదాలు అందించారు. ఈకార్యక్రమంలో మంత్రి వెంట తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.