కృష్ణ

అగ్రిగోల్డ్ బాధితుల్లో చిగురిస్తున్న ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 10: అగ్రిగోల్డ్ బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో బాధితులంతా పోలీసు స్టేషన్ల బాట పట్టారు. తమ తమ వద్ద ఉన్న బాండ్లు, ఇతర వివరాలను వెరిఫికేషన్ కేంద్రాల్లో అందచేసేందుకు క్యూ కడుతున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారుల బాండ్లను ప్రత్యక్ష పరిశీలనకు దశల వారీగా ప్రతి ఖాతాదారుని బాండ్లను పరిశీలించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లతో పాటు మండల పరిషత్ కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా వెరిఫికేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రాల్లో పరిశీలన నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న బాధితులు తమకు నిర్దేశించిన సమయంలో ఒర్జినల్ బాండ్స్‌తో ప్రత్యక్ష పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ అనుమతించని పక్షంలో అదే విషయం ఆయా స్థానిక పోలీసు స్టేషన్లలో అందుబాటులో ఉండేలా పోలీసుశాఖ కసరత్తు చేసింది. ఒర్జినల్ బాండ్, ఒర్జినల్ రశీదు, ఆధార్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్‌లను విధిగా తీసుకురావల్సి ఉంటుంది. ఏ ఖాతాదారుడు ఏ సమయంలో ఎక్కడి రావాలో సంబంధిత పోలీసు స్టేషన్ లేదా తహశీల్దార్, ఎంపిడివో కార్యాలయాల్లో జాబిబితాను ప్రదర్శిస్తారు.
ఇలావుండగా అగ్రిగోల్డ్ ఖాతాదారుల బాండ్ల పరిశీలనకు ప్రతి పోలీసు స్టేషన్‌లో ఒక లైజన్ అధికారిని నియమించినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. డిపాజిట్‌దార్ల సందేహాలను లైజన్ అధికారి నివృత్తి చేస్తారన్నారు. సంబంధిత పోలీసు స్టేషన్ సిఐ లేదా ఎస్‌ఐ, డిఎస్పీలను లైజన్ అధికారిగా నియమించామన్నారు. ఇప్పటి వరకు తమ బాండ్ల వివరాలు నమోదు చేసుకున్న ఖాతాదారులు ఈ నెల 11వతేదీ నుండి సంబంధిత వెరిఫికేషన్ కేంద్రాల్లో పత్ర పరిశీలనకు నమోదు ప్రక్రియ తేదీలు కేటాయిస్తారని ఎస్పీ త్రిపాఠి తెలిపారు.

రొయ్యల చెరువులకు అనుమతి పొందాలి
* మత్స్యశాఖ ఎడి సురేష్
నాగాయలంక, అక్టోబర్ 10: మండలంలోని తీర గ్రామాలలో గల రొయ్యల చెరువుల విషయంలో ఆయా రైతులు ఈ నెలాఖరులోగా తమ కార్యాలయంలో ముందస్తు అనుమతులు పొందాలని మత్స్యశాఖ సహాయ సంచాలకుడు పి సురేష్ కోరారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మన రాష్ట్రం నుంచి ఎగుమతి చేస్తున్న రొయ్యలలో యాంటిబయోటిక్ అవశేషాలు ఉన్నందున అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి అయిన రొయ్యల కంటైనర్లను తిరస్కరించారని ఆయన అన్నారు. ఈ కారణంగా రాష్ట్రంలోని ఆక్వా చెరువులను తనిఖీ చేసేందుకు వచ్చే నెలలో యూరోపియన్ టీమ్ వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు రిజిస్టర్ కాని ఉప్పునీటి, మంచినీటి చెరువులకు వెంటనే అనుమతి కోసం దరఖాస్తులు దాఖలు చేసుకోవాలన్నారు. కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వారికి మీ-సేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇదే సమయంలో అసైన్‌మెంట్, బికెటి, బి ఫారం, కండిషన్ పట్టా చెరువులకు చెందిన రైతులు మత్స్యశాఖ సహాయ సంచాలకులు అవనిగడ్డ వారికి అనుమతుల నిమిత్తం నిర్దేశించిన గడువులోపుగా దరఖాస్తులు దాఖలు చేసుకోవాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సురేష్ హెచ్చరించారు.