కృష్ణ

ఉపాధి హామీ కూలీల కడుపు కొడతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, అక్టోబర్ 21: ఆరుగాలం చెమటోడ్చి కష్టించే ఉపాధి హామీ పథకం కూలీల కడుపు కొడతారా? అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని సూటిగా ప్రశ్నించారు. జి.కొండూరు మండలంలోని కుంటముక్కల గ్రామంలో శనివారం జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి ఉమ మాట్లాడుతూ కూలీల కడుపు కొట్టడమే కాకుండా వైసిపి నేతలు గడప గడపకూ తిరుగుతూ ఏదో ఘనకార్యం చేసినట్లు గొప్పలు చెప్పుకుంటారా? అని ప్రశ్నించారు. కూలీలకు రావాల్సిన రూ.2వేల కోట్లను రాకుండా చేసేందుకు ఇద్దరు వైసిపి ఎంపిలను ఢిల్లీకి పంపి వైఎస్ జగన్ నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు. అమరావతిని ప్రజారాజధాని విశ్వనగరిని చేసేందుకు సిఎం చంద్రబాబు కష్టపడుతున్నారన్నారు. అమరావతికి మైలవరం నియోజకవర్గం ముఖద్వారంగా ఉందన్నారు. కృష్ణా గోదావరి పవిత్రనదుల అనుసంధానంతో మనప్రాంతం పునీతమైందన్నారు. గ్రామాల్లో వందల కిలోమీటర్లు సిసి రోడ్లు వేశామని, చెరువులు, కుంటలు, వాగులు బాగుచేశామన్నారు. కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గ్రామంలో తూర్పు చెరువుకు హారతినిచ్చారు. పంటలు బాగా పండాయని, అందరూ సంతోషంగా ఉన్నామని పేర్కొంటూ గ్రామస్థులు, రైతులు పాలసొసైటీ అధ్యక్షులు లంకా రామకృష్ణ, తూర్పు, పడమర చెరువుల నీటిసంఘాల అధ్యక్షులు సుకవాసి శ్రీహరి, లంకా నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో మంత్రి ఉమాకు ఘనస్వాగతం పలికి, గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా కేవలం కుంటముక్కల గ్రామయువతతోనే నిర్వహించిన భారీ బైక్‌ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం రూ.1.09 కోట్లతో సిమెంటు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మండల టిడిపి అధ్యక్షులు వుయ్యూరు నరసింహారావు, లంకా లితీష్ యూత్, సర్పంచ్ భారతి, ఎంపిటిసి రామారావు, తానంకి ఛార్లెస్, గోళ్ళ శ్రీనివాసరావు, ఎంవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.