కృష్ణ

అమరులకు జోహార్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 21: దేశ రక్షణ, సమాజ సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలను సైతం అర్పించిన పోలీసు అమరవీరులకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జోహార్లు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. పోలీసు మృతవీరుల స్మృత్యర్థం నిర్వహించిన ప్రత్యేక కవాతునుద్దేశించి ప్రసంగించారు. ఉన్నతమైన ఆశయంతో పోలీసు శాఖలో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని విధి నిర్వహణలో రాణించాలన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ విశిష్ఠతను తెలియజేశారు. 1959వ సంవత్సరం అక్టోబర్ 21వతేదీన భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘోర సంఘటనకు సాక్షీభూతంగా నిలిచిన సంఘటనలను వివరించారు. ప్రతి ఒక్కరూ శాంతియుత జీవనం సాగించాలని సందేశమిస్తూ పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్‌లతో కలిసి శాంతి కపోతాలను ఎగురవేశారు. తొలుత ఆర్మ్డ్ అడిషనల్ ఎస్పీ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాయుధ బలగాల వందనాన్ని ఎస్పీ త్రిపాఠి స్వీకరించారు. పరేడ్ కమాండర్‌గా వ్యవహరించిన ఆర్‌ఐ కృష్ణంరాజు నేతృత్వంలో ఆర్‌ఎస్‌ఐ కె శివరామకృష్ణ పోలీసు అమరవీరులకు సంబంధించిన ‘పుస్తక్ టోలీ’ ఎస్పీ త్రిపాఠికి అందజేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పుస్తక్ టోలీలో పొందుపర్చిన 383 మంది పోలీసు అమరవీరుల పేర్లను బందరు డిఎస్పీ ఎండి మహబూబ్ బాషా చదివి వినిపించారు. చివరిగా పోలీసు బ్యాండ్ దళం ‘అబిడ్ విత్‌మి’ పాటను సంగీత వాయిద్యాలతో వినిపించి రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డా. ధన్వంతరి ఆచార్య, మహిళా పిఎస్ డిఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్‌సి, ఎస్‌టి సెల్ డిఎస్పీ హరిరాజేంద్ర బాబు, ట్రాఫిక్ డిఎస్పీ షేక్ హుస్సేన్, ఆర్‌ఐలు కృష్ణంరాజు, నాగిరెడ్డి, సిఐలు వాసవి, శ్యామ్‌కుమార్, బిబి రవి కుమార్, సాయిప్రసాద్, ఆకుల రఘు, దుర్గాప్రసాద్, పలువురు ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.