కృష్ణ

ఎన్టీఆర్ స్టేడియం వల్లే భవిష్యత్తులో గుడివాడకు క్రీడా అకాడమీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, అక్టోబర్ 21: గుడివాడ పట్టణ, పరిసర ప్రాంత క్రీడాకారులకు ఎన్టీఆర్ స్టేడియం ఒక వరమని, దీనివల్లే భవిష్యత్తులో గుడివాడకు క్రీడా అకాడమీలు రానున్నాయని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో 63వ రాష్టస్థ్రాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్, ఎంపిక ప్రక్రియలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యలవర్తి మాట్లాడుతూ అండర్-17 బాలుర, బాలికల విభాగంలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని 13జిల్లాల నుండి క్రీడాకారులు విచ్చేశారన్నారు. వీరందరికీ అవసరమైన వసతి సౌకర్యాలను స్టేడియం కమిటీ సమకూర్చిందన్నారు. అనంతరం పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోటీల రాష్టస్థ్రాయి పరిశీలకుడు సిహెచ్ సుధాకర్, మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్, స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పిన్నమనేని సాంబశివరావు, సంయుక్త కార్యదర్శి నర్రా రత్నశేఖర్, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి కె శకుంతలాదేవి, కౌన్సిలర్ శొంఠి రామకృష్ణ, జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి దామోదరరావు, వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇసుక తవ్వకాలతో కరకట్టకు పొంచివున్న ముప్పు
* తోట్లవల్లూరు పాయలో అడ్డగోలు వ్యవహారం * నీటి ఊట వచ్చే విధంగా తవ్వకాలు
తోట్లవల్లూరు, అక్టోబర్ 21: తోట్లవల్లూరు వద్ద కృష్ణానది పాయలో ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా జరుగుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీవున్న గ్రామ ప్రజలు సొంత అవసరాలకు ఎడ్లబండ్లతో ఇసుక తోలుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ప్రతి మంగళవారం ఎడ్లబండ్లతో ఇసుక తోలకాలకు అనుమతి ఇస్తున్నారు. అయితే అధికారులు ఇచ్చిన అవకాశాన్ని ఎడ్లబండ్ల యజమానులు దుర్వినియోగం చేస్తున్నారు. పాయ లోపలికి వెళ్ళకుండా కరకట్టవైపు పొలాల దగ్గర్లోనే ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. కృష్ణానదికి వరదలు వస్తే కరకట్టకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అడ్డగోలు ఇసుక తవ్వకాల వల్ల కరకట్ట వైపున పొలాలు కోతకు గురయి కరకట్టకు రక్షణ లేకుండా ఉంటుందని అంటున్నారు. ఎడ్లబండ్ల యజమానులు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కరకట్ట వైపు ఇసుక తవ్వకాలు జరపకుండా పాయ మధ్యలో తవ్వేటట్లు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.