కృష్ణ

350 మందికి 8 మరుగుదొడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 23: ప్రజా సమస్యల పరిష్కార చర్యల్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం నిర్వహించిన ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సమక్షంలో ప్రజల నుండి వచ్చిన ఫోన్ కాల్స్‌ను స్వీకరించిన కలెక్టర్ తక్షణ పరిష్కార చర్యలు తీసుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన 22 ఫోన్ కాల్స్‌ను కలెక్టర్ లక్ష్మీకాంతమే స్వయంగా రిసీవ్ చేసుకుని వారిని ఫోన్ లైన్‌లోనే ఉంచి సంబంధిత అధికారులతో ఆ సమస్యపై చర్చించి తక్షణమే పరిష్కార చర్యలను తీసుకున్నారు. 350 మంది విద్యార్థులతో కొనసాగుతున్న నూజివీడు ఇంటిగ్రేటెడ్ గరల్స్ హాస్టల్‌లో కేవలం ఎనిమిది మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని, తామంతా అర్ధరాత్రి ఒంటి గంట నుండి లైన్‌లో నిలబడాల్సి వస్తోందని విద్యార్థిని ప్రియాంక కలెక్టర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేయగా తీవ్రంగా స్పందించిన కలెక్టర్ ఒక బ్లాక్ టాయిలెట్స్‌ను శాంక్షన్ చేస్తున్నట్లు ఆ విద్యార్థినికి తెలియజేశారు. పమిడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన సిహెచ్ మురళీకృష్ణ కలెక్టర్‌కు ఫోన్ చేసి 5వేల జనాభా కలిగిన తమ గ్రామానికి ఆర్టీసి బస్సు సదుపాయం కల్పించాలని కోరగా తక్షణమే బస్సు సర్వీసును ఏర్పాటుచేయాలని కలెక్టర్ ఆర్టీసి రీజనల్ మేనేజర్‌ను ఆదేశించారు. విజయవాడ గవర్నర్‌పేటకు చెందిన పూర్ణకిరణ్ ఆయుర్వేద వైద్యశాలలో నర్సుగా పనిచేసి పదవీ విరమణ చేసిన తన తల్లికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదని ఫిర్యాదు చేయగా పరిష్కార చర్యలు తీసుకోవాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావు దత్తత గ్రామమైన పెదపారుపూడి గ్రామ పంచాయతీ చెరువుకు అనుమతి లేకపోయినా వేలం పాట పెడుతున్నారని గ్రామానికి చెందిన శేషు ఫిర్యాదు చేయగా తక్షణమే వేలం నిలిపివేయాలని కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఎంపిహెచ్‌ఎ (మేల్) బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీచేయాలని గుడివాడకు చెందిన కె క్రిష్ట్ఫార్ విన్నవించగా ఈ రోజే నోటిఫికేషన్ జారీ చేస్తామని కలెక్టర్ సమాధానమిచ్చారు.