కృష్ణ

కులరహిత సమాజ స్థాపనే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, ఏప్రిల్ 24: అంటరానితనాన్ని రూపుమాపడంతో పాటు సమాజంలో ఉన్న మూఢనమ్మకాలపై అందరినీ చైతన్య పరిచి కులరహిత నవ సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని కారెం శివాజి పేర్కొన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ జస్టిస్ పున్నయ్య కమిషన్ వనె్న తెచ్చిన విధంగా అదే తరహాలో తాను కష్టపడి పని చేస్తానన్నారు. అన్ని సందర్భాల్లో అన్నింటా పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు అమలయ్యేలా చేస్తానని ప్రకటించారు. అలాగే దళిత, గిరిజనుల అభ్యున్నతి కోసం వారికి కేటాయించిన నిధులు సక్రమంగా పంపిణీ చేసేవిధంగా ప్రభుత్వంతో కలసి పని చేస్తామన్నారు. అదివారం నగరంలోని స్టేట్ గేస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారని వారిని అన్ని రంగాల్లో పైకి తీసుకురావడంతో పాటు వారిపై జరుగుతున్న శారీరక, మానసిక దాడులను నియంత్రించేందుకు కమిషన్ పని చేస్తుందన్నారు. కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అన్ని శాఖలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయాశాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి వాటిపై స్పష్టమైన నివేదికను తయారు చేసి వాటిని పూరించేలా ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి దళిత, గిరిజన కాలనీల్లో అవశరమైన వౌలిక సదుపాయాల కల్పనపై పూర్తి స్థాయి ఆధ్యయనం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
దళిత, గిరిజనుల అభ్యన్నతి బాబుతోనే సాధ్యం
నవ్యాంధ్రప్రదేశ్‌లో దళిత, గిరిజనుల అభ్యున్నతి కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని కారెం శివాజీ తెలిపారు. స్థానిక రాష్ట్ర అతిథి గృహంలో అదివారం కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీని రాష్ట్రంలోని పలు దళిత, గిరిజన సంఘాల నేతలు కలసి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా పోలీసులు ఎస్‌సి, ఎస్‌టి కేసులను నిర్వీర్యం చేస్తున్నారని, బాధితులకు సరైన సమయంలో న్యాయం జరగడం లేదన్నారు. ఉద్యోగాల్లో వేధింపులకు గురి చేయడం వంటి అంశాలను శివాజీ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే వసతిగృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా కారెం శివాజి సంక్షిప్త జీవితమాల బ్రోచర్‌ను విడుదల చేశారు.