కృష్ణ

పడవ ప్రమాద మృతులకు జెడ్పీ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 18: పవిత్ర సంగమం వద్ద ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నివాళులర్పించింది. జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 22 మందితో పాటు ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన జెడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు షేక్ అన్వర్ మృతికి సంతాప సూచికంగా రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఫెర్రి ప్రమాదం రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచి వేసిందని చైర్‌పర్సన్ అనూరాధ పేర్కొన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత మేల్కొనడం కన్నా జరగకముందే జెడ్పీ సమావేశాల్లో కొంత మేర ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇటీవలి కాలంలో బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, జల ప్రమాదాలు పెరుగుతున్నాయని, వీటి నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నివాళులర్పించిన వారిలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బి లక్ష్మీకాంతం, జెడ్పీ సిఇఓ కె శ్రీదేవి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులు క్రీడలకూ ప్రాధాన్యమివ్వాలి

జగ్గయ్యపేట, నవంబర్ 18: విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, గతంలో కంటే ప్రైవేటు పాఠశాలల్లో సైతం క్రీడా విషయంలో మార్పు వచ్చిందని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. పట్టణంలోని ఆర్‌టిసి గ్రౌండ్స్‌లో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న బాల చైతన్య స్ఫూర్తి క్రీడల బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడుతూ పది సంవత్సరాల కిందట విద్యార్థుల్లో క్రీడలపట్ల చైతన్యం తీసుకురావాలన్న బలుసుపాడు గెంటేల వెంకట రమణ సూచనలతో చేపట్టిన ఈ క్రీడలు లక్ష్యాలను సాధిస్తున్నాయని అన్నారు. కర్లపాటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా సభలో మున్సిపల్ కమిషనర్ రమేష్, సిఐ లచ్చునాయుడు, తహశీల్దార్, ఫ్లోర్ లీడర్ యలమంచిలి రాఘవ, డివైఇఒ చంద్రకళ, చార్టెడ్ ఎకౌంటెంట్ బదిరీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను చేగు విద్యాలయం విద్యార్థులు అందుకున్నారు.

క్షేత్రస్థాయి పని అనుభవం పొందిన వ్యవసాయ విద్యార్థినులు

తోట్లవల్లూరు, నవంబర్ 18: కళాశాలలో నాలుగు గోడల మధ్య పుస్తకాల్లో చదివిన చదువుకంటే రైతులతో కలిసి నాలుగు నెలల పాటు క్షేత్రస్థాయిలో చేసిన పంటల పరిశీలనలో ఎంతో వ్యవసాయ విజ్ఞానం నేర్చుకున్నామని బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థినులు చెబుతున్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలోని 81 మంది అగ్రికల్చర్ స్టూడెండ్స్ నాలుగు నెలల క్రితం గ్రామీణ వ్యవసాయ పని శిక్షణ అనుభవం కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లాకు వచ్చారు. వారిలో 37 మంది తోట్లవల్లూరు మండలంలోని భద్రిరాజుపాలెం, చాగంటిపాడు, దేవరపల్లి, తోట్లవల్లూరు, యాకమూరులో రైతులవద్ద ఉంటూ వ్యవసాయ పనుల్లో ప్రత్యక్షంగా అనుభవం గడించారు. లంకలు, మాగాణి పొలాలు తిరిగి రైతులతో కలసిపోయి కందసాగు, పసుపుసాగు, అరటి, తమలపాకు, చెరకుసాగు, వరిసాగు, పలు రకాల పంటల సాగుపై మెలకువలు తెలుసుకున్నారు.