కృష్ణ

రాష్ట్రంలో అరాచక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగంచిప్రోలు, నవంబర్ 21: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచక పాలన కొనసాగిస్తుందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ఆరోపించారు. కొణకంచిలో మంగళవారం సాయంత్రం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి పల్లె నిద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు గృహ నిర్మాణాలకు ఇసుక తోలుకునేందుకు అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని, తెలుగుదేశం పార్టీ వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తున్నారని తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ రచ్చబండలో వచ్చిన సమస్యలు అన్నింటినీ పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకువెళతామన్నారు. అలాగే ప్రతి కార్యకర్త 2019లో జరగబోయే ఎన్నికలకు సంసిద్ధం కావాలని కోరారు. ఇప్పటి నుండి ప్రతి నాయకుడు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి గూడపాటి శ్రీనివాసరావు, సహకార సంఘ అధ్యక్షుడు కనగాల శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పవర్ లిఫ్టింగ్ విజేతకు సామినేని అభినందన

జగ్గయ్యపేట, నవంబర్ 21: రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 59 కేజీల విభాగంలో ప్రథమ స్థానం సాధించిన వి ప్రవీణ్‌కుమార్, కోచ్ ఘంటా వెంకటేశ్వర్లును వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అభినందించారు. మంగళవారం తన నివాసంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అభినందించారు. ప్రవీణ్‌కుమార్ ఫిబ్రవరిలో కన్యాకుమారిలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనందున అక్కడ ప్రతిభ చూపి పట్టణానికి, జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సామినేని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నేతలు ఇంటూరి విజయ రామారావు, గూడపాటి శ్రీనివాసరావు, ఎన్ కోటేశ్వరరావు, పఠాన్ ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.