కృష్ణ

రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, నవంబర్ 23: బుడమేరు ఆధునికీకరణలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని కౌలు రైతు సంఘం తూర్పు కృష్ణా ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో బుడమేరు బంజరు సాగుదారులు, రైతులు ధర్నా నిర్వహించారు. ముందుగా ఆంజనేయపేటలోని సీపీఎం కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధాన గేటు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ 2012లో బుడమేరు ఆధునికీకరణలో భాగంగా తవ్వకాలు జరిగాయన్నారు. కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. అప్పటి నుండి భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. వరుస ఉద్యమాలు, పోరాటాల వల్ల కదిలిన ప్రభుత్వం పట్ట్భాముల రైతులకు పరిహారం ఇచ్చిందన్నారు. అయితే బంజరు సాగుదారులకు మాత్రం ఇవ్వలేదన్నారు. క్షేత్రస్థాయిలో బంజరు సాగుదారులకు అన్యాయం చేసిందని, దీంతో వారు కూలీలుగా మారారన్నారు. బంజరు సాగుదారులను ఆదుకోవాలని కోరుతూ డ్రైనేజ్, రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవోను కలిసేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే వన్‌టౌన్ సీఐ డి వెంకటరమణ మాత్రం 10మందిని మాత్రమే లోనికి అనుమతిస్తామని చెప్పారు. దీంతో ఆర్డీవో ఎం చక్రపాణిని కలిసి సమస్యను వివరించారు. సాగుదారుల గుర్తింపు కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని ఆర్డీవో హామీ ఇచ్చారు. ఎప్పటిలోగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో చెప్పాలని రైతులు పట్టుబట్టారు. 20రోజుల్లోగా సర్వే పనులు పూర్తిచేస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏరియా కార్యదర్శి ఆర్‌సీపీ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు కృష్ణా కార్యదర్శి మురాల రాజేష్, రైతు సంఘం డివిజన్ కార్యదర్శి నీలం మురళీకృష్ణారెడ్డి, సీఐటీయు డివిజన్ కార్యదర్శి కే సుబ్బారావు, సభ్యుడు బీవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.