కృష్ణ

జిల్లా అభివృద్ధే ధ్యేయం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 28: అన్ని స్థాయిల్లోని పార్టీ సమావేశాలు సకాలంలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. ప్రభుత్వ అతిథిగృహంలో గురువారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి గ్రామ, మండల, నియోజకర్గ సమన్వయ కమిటీ సమావేశాలపై సమీక్ష నిర్వహించారు. వివిధ స్థాయిల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తీరును నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. శాసనసభ్యులు, ఇన్‌చార్జిలు వారి నియోజకవర్గాల్లోని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించే విధంగా అధికారులకు సమస్యల పరిష్కారానికి ఆయన తగిన సూచనలు చేశారు. జిల్లా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి అధిగమించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని, అవసరమైన ప్రదేశాల్లో బోర్లు వేయుటకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.