కృష్ణ

సమష్టిగా కృషిచేస్తే 2019 నాటికి పోలవరం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 12: పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయ పార్టీలు భేషజాలు మానుకుని పనులు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. మధ్యతరగతి, యువత, దళితులు, పేదలు, రైతులు, కౌలుదారులు అనే నాలుగు వర్గాలకు సంబంధించి ఆరు అంశాలతో లోక్‌సత్తా పార్టీ చేపట్టిన చేపట్టిన సురాజ్య యాత్ర మంగళవారం కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జయప్రకాష్ నారాయణ పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై స్పందించారు. పోలవరం నిర్మాణం ఆగితే ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా నష్టం కలిగే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలస్యంగా పనులు ప్రారంభమైనా గత సంవత్సర కాలంలో పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికపరమైన లావాదేవీల అంశం కారణంగా పనుల్లో కొంత నిర్లిప్తత ఏర్పడిందన్నారు. పోలవరం డిజైన్ తయారీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందన్నారు. దీన్ని సరి చేసుకుని ముందుకు సాగితే 2019 నాటికి పోలవరం నిర్మాణం పూర్తి అవుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. పని విషయంలో సమర్థుడైన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ పోలవరంను గాడిన పెడతారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ప్రత్యేక హోదా అంశం చెల్లని చెక్కు వంటిదన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా రాదని తెలిసి కూడా చట్టం చేసిందన్నారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ సరైన ప్రయత్నం చేయలేకపోవటం వల్ల ప్రత్యేక హోదా అంశం మూలనపడింది. మన వెనుకబాటు తనాన్ని సరైన గణాంకాలతో కేంద్రానికి నివేదించకపోవడం వల్లే హోదా రాలేదని జయప్రకాష్ నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో 10 నుండి 15 శాతం ఎన్నికల ప్రయోజనం ఉంటుందని భావిస్తే లోక్‌సత్తా ఎన్నికలకు సిద్ధంగా ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో రెండు శాతం ఓటింగ్ సాధించినా మూడు అంశాల్లో రాజ్యాంగ సవరణలు, ఆరు ఏడు అంశాల్లో చట్టాలు చేయించిన పార్టీగా లోక్‌సత్తా విజయం సాధించిందని జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు.