కృష్ణ

ఉద్యోగ రథం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్రంలో మారుమూలలలోని అభ్యర్థుల ముంగిటకే ఉద్యోగావకాశాలను తీసుకెళ్లే ఎంప్లాయిమెంట్ బస్ ‘ఉద్యోగ రథాన్ని’ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం పిబి సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో ఆవిష్కరించారు. దేశంలోనే తొలిసారిగా టిఎమ్‌ఐ గ్రూప్ ఈ ప్రచార రధాన్ని సిద్ధం చేసింది. అన్ని రకాల స్థానిక ఉద్యోగులు, అలాగే స్థానిక ఉద్యోగార్థులను నమోదు చేసుకోవడం వారి అర్హతలకు తగిన ఉద్యోగాలున్న చోట వాటితో అభ్యర్థులను అనుసంధానం చేయడం ఈ ఉద్యోగరధం లక్ష్యం. కేశినేని గ్రూపు ఈ బస్సును విరాళంగా అందించిది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేశినేని భవన్ ఆఫీసర్ వుత్సా మోహనరావును ప్రత్యేకంగా అభినందించారు. కేశినేని భవన్‌లో గత ఏడాది కాలంగా 700 మంది నిరుద్యోగ యువతకు కెరీర్ గైడెన్స్‌లో మద్దతు నిస్తూ ఉద్యోగావకాశాలను కల్పించినందుకు గాను సిఎం అతన్ని అభినందించారు. ఈ సందర్భంగా డిఎమ్‌ఐ గ్రూప్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ టి.మురళీధరన్ మాట్లాడుతూ ‘తక్కువ ఆదాయం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఉద్యోగార్థుల్లో చాలా మంది ఇంటర్నెట్‌కు యాక్సిస్ కలిగి ఉండటం లేదని, ఇంగ్లీషులో ప్రజ్ఞ కల్గిలేరని అన్నారు. జాబ్ బోర్డ్స్, ఇతర జాబ్ సెర్చి ఆప్షన్లను ప్రభావపూరితంగా వినియోగించుకోవడాన్ని వారు సవాళ్లతో కూడుకున్నదిగా భావిస్తున్నారని అన్నారు. అందుకే బస్ , రైల్వేస్టేషన్‌లు, కళాశాలలు... ఇలా ఉద్యోగగావకాశాలు ఎక్కడ ఉన్నా వారి తాజా సమాచారాన్ని ఈ ఉద్యోగ సంఘం తీసుకుంటుందని అన్నారు. అనంతరం వారికి తగిన ఉద్యోగాలు ఉన్నచోట వారిని ఆయా యాజమాన్యాలను అనుసంధానం చేస్తుందన్నారు.