కృష్ణ

నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలులో జాప్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 15: సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను త్వరితగతిన అమలు చేయాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలులో జాప్యం జరిగితే దాని ప్రభావం న్యాయస్థానాల్లో విచారణ, కేసుల పరిష్కారంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అంతేకాకుండా న్యాయస్థానాల్లో కేసులు పేరుకుపోతాయన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను స్పెషల్ డ్రైవ్‌గా తీసుకోవాలన్నారు. 2012వ సంవత్సరానికి ముందు నమోదైన కేసులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అంతర్ రాష్ట్ర నేరస్తులు ఉన్నట్లైతే తక్షణం ఆయా రాష్ట్రాల్లో వారి వివరాలు తెలుసుకుని అరెస్టు చేసి న్యాయస్థానాల్లో హాజరు పర్చాలన్నారు. గత నవంబర్ 30వతేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా పెండింగ్ వారెంట్ల సంఖ్య 342 ఉండగా ప్రత్యేక శ్రద్ధ కనబర్చి 106 వారెంట్లను అమలు చేసినట్లు తెలిపారు. ఇందులో రాజస్థాన్‌కు చెందిన ఒక వారెంట్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వారెంట్, తమిళనాడుకు చెందిన ఒక వారెంట్, తెలంగాణకు చెందిన మూడు వారెంట్లు అమలు జరిగాయని ఎస్పీ త్రిపాఠి తెలిపారు.

ఆగస్టు నాటికి పేటకు కృష్ణాజలాలు
జగ్గయ్యపేట రూరల్, డిసెంబర్ 15: జగ్గయ్యపేట పట్టణ ప్రజలకు కృష్ణా జలాలను మంచినీరుగా అందించేందుకు చేపట్టిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, 2018 ఆగస్టు నాటికి పథకం పూర్తిచేసి ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు ఎంఎల్‌సీ తొండెపు దశరథ జనార్ధన్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌లు తెలిపారు. శుక్రవారం జగ్గయ్యపేట - ముక్త్యాల రహదారిలో పైపులైన్ నిర్మాణాలు పరిశీలించిన వారు అనంతరం ముక్త్యాల కృష్ణానది వద్ద పథకం నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించారు. అధికారుల ద్వారా పథకం పురోగతి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణంలోని 50వేల మంది జనాభాకు కృష్ణా జలాలను స్వచ్ఛమైన తాగునీరుగా అందించేందుకు ఈ పథకం చేపట్టడం జరిగిందని, గతంలోని పాలకులు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, తాము మాత్రం నిర్మాణాలు ప్రారంభిం చి ఆచరణలో చూపుతున్నామన్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగానే ఆయన ఆమోదముద్ర వేసి నిధులు కూడా మంజూరు చేశారని, పథకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ముక్త్యాల కృష్ణానది నుండి పద్మావతినగర్ పంప్ హౌస్ వరకూ ఏడున్నర కిలో మీటర్ల పరిధిలో పైపులైన్ నిర్మాణం45రోజుల్లో పూర్తవుతుందన్నారు. నాణ్యమైన పైపు ల ద్వారా నిమిషానికి 9వేల లీటర్ల నీరు సరఫరా జరుగుతుందని, నదిలో ఇం టెక్‌వెల్‌కు సంబంధించి అధికారులు సాయిల్ టెస్టింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సాయిల్ టెస్ట్ రిపోర్టు రాగానే రింగ్ బండ్ నిర్మాణాలు ప్రారంభం అవుతాయన్నారు. ఎస్‌ఇ, ఇఇలు ప్రతి వారం పథకం పర్యవేక్షిస్తున్నారని అభినందించారు. ఇన్‌టెక్‌వెల్, పైపులైన్ నిర్మాణం సమాం తరంగా సాగుతోందని, కొనే్న ళ్ల జగ్గయ్యపేట పట్టణ వాసుల కల త్వరలోనే సాకారం అవుతుందని, వేసవిలో సైతం తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఎంసీ చైర్మన్ మల్లెల గాంధీ, ఫ్లోర్ లీడర్ యలమంచిలి రాఘవ, మండల పార్టీ అధ్యక్షుడు కట్టా నర్శింహరావు, తిరుమలగిరి పాలకవర్గ చైర్మన్ దర్శి విజయనర్శింహరావు, గుండ్ల కృష్ణారావు, కౌన్సిలర్‌లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.