కృష్ణ

ముగిసిన సీఆర్‌డీఏ డీప్‌డైవ్ వర్క్‌షాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 15: ప్రజారాజధాని నిర్మాణంపై సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో అమరావతి డీప్‌డైవ్ పేరిట నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్ శుక్రవారం విజయవంతంగా ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు పి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు సింగ్‌పూర్ ప్రతినిధులు, నార్మన్ పోస్టర్ పార్టనర్స్ ప్రతినిధులతోపాటు 11 దేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతోపాటు 40 కంపెనీలకు చెందిన పలువురు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని తమ సలహాలు, సూచనలిచ్చారు. ముగింపు ఉత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచలోని 5 బెస్ట్ నగరాల్లో అమరావతి రాజధాని నగరాని ఒకటిగా నిలిచేవిధంగా నిర్మిస్తానని, ఇందుకు ప్రస్తుతం నిర్వహించిన డీప్‌డైవ్ వర్క్‌షాప్‌లో మేథావులు తెలిపిన ఆయా సూచనలను పరిగణలోకి తీసుకొంటామని అన్నారు. హ్యాపీ సిటీ, అర్బన్ డిజైన్, సస్టెయినబిలిటీ, ట్రాన్స్‌ఫోర్ట్ మొబిలిటీ, వాటర్, వేస్ట్ వాటర్, స్ట్రామ్ వాటర్, పవర్ అండ్ రెన్యువబుల్స్, కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, గవర్నెన్స్, మీడియా ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్‌సిటీ, నాలెడ్జ్ సిటీ, టూరిజం, స్టార్టప్ ఏరియా, తదితర అంశాలపై జరిగిన చర్చల సారాంశాన్ని సీఎంకు వివరించారు. అలాగే నార్మన్ పోస్టర్‌ప్రతినిధులు ఏర్పాటు చేసిన అసెంబ్లీ డిజైన్లను ముఖ్యమంత్రి, మత్రులు ఇతర అధికారులు, ప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ రూపొందించిన మూడు యాప్‌లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. యాప్‌లు, బ్లాక్ చైన్ బేస్ట్ అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టం, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడల్ పర్మిట్ సిస్టం, వెబ్‌జిఐఎస్ ఆన్‌లైన్ సిస్టం యాప్‌లలోబిఏఎంఎస్ ద్వారా సీఆర్‌డీఏ ల్యాండ్ రికార్డులు, ఓనర్‌షిప్ ఆఫ్ అసెట్స్ డేటా మొత్తాన్ని సురక్షితంగా పరిరక్షించడం జరుగుతుందని, బీఐఎంపీఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో భవనాలకు సత్వర అనుమతులకు, సింగిల్ విండో క్లియరెన్స్, సీమ్‌లెస్ సిటిజన్ సెంట్రిక్ సిస్టం అమలుచేస్తారు. వెబ్‌జిఐఎస్ ఆన్‌లైన్ సిస్టంలో రాజధాని పరిధిలోని రైతుల ప్లాట్లు, ఓపెన్ స్పేసెస్, సరిహద్దులు, ఓవరాల్ మ్యాప్ అన్ని తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.
సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ ముగింపు ఉపన్యాసం చేస్తూ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ప్రతినిధులతో నిరంతరం ఫోన్, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సంప్రదింపులు చేస్తామన్నారు. వారి సలహాలు, సూచనలతో అమరావతిని బెస్ట్ గ్రీన్ ఫీల్డ్ సిటీగా రూపొందిస్తామన్నారు. ప్రతి ఆరు నెలలకొకసారి కార్యాచరణపై సమీక్షిస్తామని తెలిపారు. సీఆర్‌డీఏ స్పెషల్ కమిషనర్ వి రామమనోహరరావు వర్క్‌షాప్‌లో వందన సమర్పణ చేశారు. రెండు రోజులపాటు జరిగిన వర్క్‌షాప్‌లో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని అందరూ ప్రశంసించారు. అమరావతి అభివృద్ధి సంస్థ సీఎండీ లక్ష్మీపార్థసారథి, అదనపు కమిషనర్ సగిలి షణ్మోహన్, బిఎల్ చెన్నకేశవరావు ఏపీసీఆర్‌డీఏ మీడియా సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.