కృష్ణ

మంచినీరివ్వాలంటూ మున్సిపల్ కార్యాలయానికి తాళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఏప్రిల్ 28: స్థానిక 10వ వార్డుకు మంచినీరివ్వాలంటూ ఆ వార్డు మహిళలు గురువారం మున్సిపల్ కార్యాలయానికి తాళం వేశారు. కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మద్దతు తెలపడంతో టిడిపి కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళనలో భాగం పంచుకున్నారు. దీంతో కార్యాలయ ఉద్యోగులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కార్యాలయానికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే రావి కమిషనర్, ఎంఈలతో వాగ్వివాదానికి దిగారు. 10వ వార్డులో సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వన్‌టౌన్, టూటౌన్ సీఐలు ఎంవి దుర్గారావు, కె శివాజీ రంగప్రవేశం చేసి ఆందోళన విరమించాలని కోరారు. సాయంత్రంలోగా సమస్యను పరిష్కరిస్తానని కమిషనర్ హామీ ఇవ్వడంతో వార్డు ప్రజలు, మహిళలు ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్, టిడిపి పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, కోఆప్షన్ సభ్యుడు గోకరకొండ బలరాం, టిడిపి కౌన్సిలర్లు పొట్లూరి వెంకట కృష్ణారావు, శొంఠి రామకృష్ణ, మెరుగుమాల మేరీసంతోషం, తెలుగు మహిళా పట్టణ అధ్యక్షురాలు సిరిపురపు తులసీరాణి, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు కడియాల గణేష్, మాజీ కౌన్సిలర్ జోగా సూర్యప్రకాశరావు, టిడిపి నాయకులు షేక్ సర్కార్, ముళ్ళపూడి రమేష్‌చౌదరి, గడ్డం ప్రకాష్‌దాస్, మహ్మద్ అబూ, ఎస్‌ఎస్ నాయుడు, బొంబాయి శ్రీను, అల్లాడ శ్రీనివాసరావు, జోగా బాలకృష్ణ, జానీ షరీఫ్, మెరుగుమాల బ్రహ్మయ్య, నైనవరపు శేషుబాబు, రేమల్లె కమలకుమారి, చల్లగుళ్ళ సుబ్రహ్మణ్యేశ్వరరావు, రామదేని వేణుబాబు, బొడ్డు వెంకట నారాయణ, వార్డు ప్రజలు గుడివాడ వాణి, తలారి, వెంకమ్మ, గుండ్రెడ్డి రంగమ్మ పాల్గొన్నారు.