కృష్ణ

రాజకీయ వ్యవస్థ అంతా మారిపోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు, జనవరి 12: రాజకీయ వ్యవస్థ అంతా మారిపోయిందని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి ఎ రామలింగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని సింగలూరు గ్రామంలో శుక్రవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలను భాగ్యవిధాత ఛారిటబుల్ ట్రస్టు, భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం భారత్ వికాస్ పరిషత్ వారి ఏర్పాటు చేసిన ఏటీఎం, వాటర్ ప్లాట్‌ను, ఉచిత కంప్యూటర్ సెంటర్‌ను న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ 2006 నుంచి గ్రామాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిలో నడుపుతున్న డా. బండారు శ్యామ్‌కుమార్‌ను అభినందించారు. మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆ మనిషిలో కులం, మతం చూడకుండా మానవత్వాన్ని చాటాలన్నారు. స్ర్తిలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారన్నారు. అనంతరం గ్రామంలోని వృద్ధులకు దుప్పట్లు, విద్యార్థులకు యూనీఫామ్ పంపిణీ చేశారు. ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలైన మహిళలకు బహుమతులు అందించారు. అనంతరం న్యాయమూర్తి రామలింగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. కవి హెచ్‌ఆర్ చంద్రం రచించిన రంగస్థలి పుస్తకాన్ని న్యాయమూర్తి ఆవిష్కరించారు. గుడివాడ ఎఎన్‌ఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా. ఎర్నేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది చిత్తర్వు నాగేశ్వరరావు, డా. పొట్లూరి రవీంద్రబాబు, చంద్రాల గ్రామ సర్పంచ్ గరికపాటి దేవకరుణ, గుడ్లవల్లేరు గ్రామ సర్పంచ్ వల్లభనేని సుబ్బారావు, తహశీల్దార్ స్వర్ణమేరి, ఎంఇఓ పి శంకర్‌నాధ్, భారతవికాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి లక్ష్మీనారాయణ, జాప్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నందం జోగేంద్రప్రసాద్, తదితరులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మైలవరం కార్యదర్శి రఫీకి ఉత్తమ ప్రశంసా అవార్డు

మైలవరం, జనవరి 12: మైలవరం పంచాయితీ కార్యదర్శి మహమ్మద్ రఫీకి ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా అవార్డు లభించింది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఆత్మగౌరవ దీక్షలలో భాగంగా రోజుకొక అంశంపై నిర్వహించాలని తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించటం, అదేవిధంగా జన్మభూమి కార్యక్రమాన్ని ఉత్సాహకంగా, ఉల్లాసంగా ఎటువంటి వివాదాలకు అవకాశం లేకుండా నిర్వహించినందుకు గానూ ఆయనకు ప్రభుత్వం శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రశంసాపత్రం, దుశ్శాలువాతో సత్కరించి మెమెంటోతో జడ్పీ చైర్మన్ గద్దె అనురాధ బహూకరించారు. ఇదిలా ఉండగా రఫీకి సత్కారం పట్ల పుర ప్రముఖులు పలువురు అభినందనలు తెలియజేశారు.