కృష్ణ

జాతీయస్థాయి ఎడ్లబండ లాగుడు పోటీలతో గుడివాడకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, జనవరి 12: ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు జాతీయస్థాయి పోటీలు గుడివాడకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. స్థానిక లింగవరం రోడ్డులోని కే కనె్వన్షన్‌లో నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి దాదాపు 70జతల ఒంగోలు జాతి ఎడ్లు వచ్చాయి. వేలాది మంది రైతులు, పశుపోషకులతో పాటు గుడివాడ పట్టణ, పరిసర ప్రాంతాల నుండి పెద్దఎత్తున ప్రజలు ఈ పోటీలను చూసేందుకు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. గుడివాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి జాతీయస్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కొడాలివ్యవసాయ నేపథ్య కుటుంబం నుండి రావడంతో మూడు దశాబ్దాలుగా పశుపోషకునిగా కొనసాగుతుండడం ఆయనకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. తొలిరోజు మధ్యాహ్నం 2గంటలకు పోటీలు ప్రారంభం కాగా పాలపళ్ళు విభాగంలో పలు ఎడ్ల జతలు పోటీపడ్డాయి. 1150కేజీల బరువున్న బండను 15నిమిషాల పాటు ఎడ్లు లాగాల్సి ఉంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ఎక్కువ దూరం లాగిన ఎడ్ల జతలకు వరుస స్థానాలను ప్రకటించనున్నారు. కాగా తొలిరోజు రాత్రి 7గంటల సమయానికి దాదాపు 10జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. పోటీల్లో పాల్గొనే ఎడ్ల నిర్వాహకులకు జ్ఞాపికలను అందజేస్తున్నారు.

పట్టణంలో ఘనంగా వివేకానందుని 155వ జయంతి వేడుకలు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 12: స్వామి వివేకానందుని 155వ జయంతి వేడుకలను శుక్రవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సిబ్బంది వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, వివేకానందుని సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఎఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్లు విక్టర్‌పాల్, నెల్సన్‌పాల్ తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని గోకవరం పంచాయతీ రెడ్డిపాలెంలో జరిగిన జయంతి వేడుకల్లో సయ్యద్ పీర్‌షావలీ మాట్లాడుతూ వివేకానందుడు నిత్య చినస్మరణీయుడన్నారు. అనంతరం బిస్మిల్లా బాబా వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ శ్రీరాములురెడ్డి, దర్బారు ప్రెసిడెంట్ సయ్యద్ బాజీ, శ్రీను, సెక్రటరీ షేరాలి, ఆయుర్వేద వైద్యుడు డా. నాగలింగం నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక చల్లరస్తా సెంటరులో మైనంపూడి సాయిబాబు ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో బుల్లెట్ ధర్మారావు, షేక్ వౌలాలి, బి సత్యనారాయణ సింగ్, అయూబ్ బేగ్, పృధ్వీప్రసన్న, తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా శుక్రవారం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఘనంగా సన్మానించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మత్తి వెంకటేశ్వరరావు, దిడ్ల వీరరాఘవులు, తిలక్, శ్రీమన్నారాయణ, రజినికాంత్ తదితరులు పాల్గొన్నారు.