కృష్ణ

రాష్ట్భ్రావృద్ధికి చెన్నుపాటి సేవలు వినియోగించుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, జనవరి 13: నానో టెక్నాలజీతో ప్రపంచం గర్వించే శాస్తవ్రేత్తగా ఎదిగిన చెన్నుపాటి జగదీష్ సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వల్లూరుపాలెంలో శనివారం చెన్నుపాటి జగదీష్‌ని మంత్రి ఉమా, ఎమ్మెల్సీ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు కలిశారు. ఈ సందర్భంగా జగదీష్‌ని మంత్రి శాలువాతో సత్కరించి పోలవరం ప్రాజెక్టు పుస్తకాన్ని బహూకరించారు. ఆస్ట్రేలియాలో నానో టెక్నాలజీ ద్వారా అందిస్తున్న సేవలను జగదీష్ వివరించారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులను బతికించేందుకు పరిశోధనలు చేస్తున్నామని, అలాగే క్యాన్సర్‌కు సైడ్ ఎపెక్క్ లేకుండా సూక్ష్మ చికిత్సను తీసుకు వస్తున్నామని జగదీష్ మంత్రికి తెలియజేశారు. నానో టెక్నాలజీని సోలార్ వ్యవస్థ అభివృద్ధికి వినియోగిస్తామన్నారు. ఇంకా వ్యవసాయం, తదితర రంగాల్లో నానో టెక్నాలజీతో అద్భుత ఫలితాలు సాధించ వచ్చన్నారు. అనంతరం మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు తేజం జగదీష్ ఆస్ట్రేలియాలో కంపానియన్ ఆర్డర్ అవార్డు అందుకోవటం గర్వించదగ్గ విషయమన్నారు. సైన్స్ కాంగ్రెస్‌కి జగదీష్‌ని తీసుకు వస్తామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నానో టెక్నాలజీని వినియోగించేందుకు త్వరలో సీఎం చంద్రబాబునాయుడుతో జగదీష్‌ని సమావేశపరుస్తామని అన్నారు. వల్లూరుపాలెంలో ఎన్‌ఎస్‌ఎస్ క్యాంపులో విద్యార్థులను మంత్రి ఉమా, శ్రాస్తవేత్త జగదీష్ కలిశారు. రాష్ట్ర ఉపాధిహామీ మండలి డైరెక్టర్ వీరంకి వెంకట గురుమూర్తి, ఎంపీటీసీ సభ్యులు చెన్నుపాటి స్వరూపరాణి, మూడే శివశంకర్, చెన్నుపాటి అనిల్‌కుమార్(ఎన్‌ఆర్‌ఐ) మాజీ సర్పంచ్ చెన్నుపాటి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.