కృష్ణ

కాలు దువ్వుతున్న పందెం రాయుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 13: సంప్రదాయ ముసుగులో సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు నిర్వహించే కోడి పందాలపై ఉత్కంఠ నెలకొంది. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత కోడి పందాలకు కృష్ణాజిల్లా గత మూడేళ్లుగా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గత మూడేళ్లుగా జిల్లాలో కోడి పందాలు భారీ స్థాయిలో నిర్వహిస్తూ వచ్చారు. అధికార తెలుగుదేశం పార్టీ అండదండలతో జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో భారీ బరులను ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహించారు. అయితే ఈ ఏడాది కోడి పందాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గత నెల రోజుల నుండే పోలీసు శాఖ కోడి పందాలు, పేకాట వంటి జూదాలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరికలు చేస్తూ వచ్చారు. హెచ్చరికలతో పాటు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు గాను స్టేషన్‌ల వారీగా ప్రజలకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తూ వచ్చారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా కోడి పందాలపై కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. కలెక్టర్ బి లక్ష్మీకాంతం, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సమన్వయంతో వ్యవహరిస్తూ వివిధ శాఖల అధికారులతో గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. దీంతో బరుల నిర్వాహకుల గొంతులో వెలక్కాయ పడినట్లైంది. అయితే సంక్రాంతి పండుగకు రెండు రోజుల క్రితం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కత్తులు లేకుండా పందాలు వేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా కోడి పందాలు జరిగే ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందికర వాతావరణాన్ని కల్పించవద్దని పోలీసులకు సూచింది. దీంతో పందెపురాయుళ్లల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. గత ఏడాది కూడా ఇటువంటి తీర్పే సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే కత్తులు కట్టకుండా తాము పందాలు వేసుకుంటామని నిర్వాహకులు పోలీసుల నుండి అనుమతులు తీసుకుని బరులు ఏర్పాటు చేశారు. తీరా బరుల్లో మాత్రం కోళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహించారు. ఈ ఏడాది కూడా అటువంటి పరిస్థితులే ఉంటాయని భావించిన నిర్వాహకులు రాత్రికి రాత్రే బరులను సిద్ధం చేశారు. అయితే ఇందుకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు, పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించారు. అలాగే ముందస్తుగా గుర్తించిన పందెపురాయుళ్లు, కత్తులు కట్టే వారిపై బైండోవర్ కేసులు పెట్టారు. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో పెనమలూరులో పలు బరులను పోలీసులు ధ్వంసం చేశారు. కంకిపాడు మండలం ఈడ్పుగల్లులోని మూడు నాలుగు బరులను ఏర్పాటు చేసి ప్రతి యేటా భారీగా కోడి పందాలు నిర్వహిస్తూ వచ్చారు. అటువంటి బరులను సైతం పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా రాజకీయ నాయకుల జోక్యంతో భారీ స్థాయిలో కోడి పందాలు నిర్వహించారు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా రాజకీయ నేతల జోక్యం నిమిష నిమిషానికి పెరుగుతోంది. పండుగ మూడు రోజుల పాటు కోడి పందాలు వేసుకునేందుకు పోలీసులపై తీవ్రమైన ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. కొంత మంది రాష్ట్ర స్థాయి నేతలు జోక్యం చేసుకుని పోలీసు పెద్దలపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. గత ఏడాది పండుగకి రెండు మూడు రోజుల నుండే కోడి పందాలు, పేకాట శిబిరాలు ప్రారంభించగా ఈ ఏడాది మాత్రం పండుగ ముందు రోజు వరకు ఉత్కంఠ నెలకొనడం విశేషం.

ముగిసిన డెల్టా కార్మికుల వివాదం
*దీక్షల విరమణ
హనుమాన్ జంక్షన్, జనవరి 13: హనుమాన్ జంక్షన్ సమీపంలోని డెల్టా సుగర్స్ యాజమన్య వైఖరికి నిరసనగా కార్మికులు చేపట్టిన రిలే నిరహార దీక్షలు ముగిశాయి. అర్ధంతరంగా ఫ్యాక్టరీ మూసివేయడంతోపాటు కార్మికులను విధులకు రాకుడదని నోటీసు పంపిన డెల్టా యాజమాన్యంపై కార్మికులు పోరుబాట ప్రారంభించారు. ఫ్యాక్టరీ గేటు ఎదురుగా 48 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి ఏటువంటి స్పందన రాకపోవడంతో గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌కు కార్మికులు తమ పరిస్థితిని వివరించారు. దీంతో శనివారం ఫ్యాక్టరి యాజమాన్యంతో ఎం.ఎల్.ఏ వంశీ చర్చలు జరిపారు. శాశ్వత కార్మికులకు 5నెలల జితం, కాంట్రాక్టు కార్మికులకు 3 నెలల జీతం ఇచ్చేందుకు ఫ్యాక్టరి ప్రతినిధి రాజాబాబు అంగీకారం తెలిపారు. జీతంతోపాటు కార్మికులకు రావాల్సిన పిఎఫ్ చెల్లించేందుకు యాజమాన్యం సముఖత వ్యక్తం చేయడంతో రిలే దీక్షలను విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు.