కృష్ణ

పర్యాటకంగా నాగాయలంకకు రాష్ట్ర స్థాయి గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, జనవరి 18: పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త నిర్వహణలో స్థానిక శ్రీరామపాదక్షేత్రం సమీపాన గల పుష్కరఘాట్ వద్ద చేపడుతున్న పర్యాటక, సాంస్కృతిక కార్యక్రమాలు దివిసీమ ప్రాంత ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం నాగాయలంక సమీపంలో పర్యాటక శాఖ నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన నవ్యలంకలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో పర్యాటక, సాంస్కృతిక రంగాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని, రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలలో ఈ రెండు శాఖల సమన్వయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించగా వాటిలో నాగాయలంక ఒకటి కావటం ఈ ప్రాంత వాసుల అదృష్టమన్నారు. వాటర్ స్పోర్ట్స్ అథారిటీ పర్యవేక్షణలో జలక్రీడల శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వం ఇప్పటికే రూ.3కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ రెండు శాఖల సమన్వయంతో ప్రభుత్వం లక్షలాది రూపాయల వ్యయంతో దివిసీమ సంప్రదాయ రాష్ట్ర స్థాయి పడవల పోటీలను నిర్వహించటం ద్వారా పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులను ఆదరించినట్లైందన్నారు. నాగాయలంకలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని ఐదు రోజుల పాటు ఈ రెండు శాఖలతో పాటు జిల్లా యంత్రాంగం, స్వచ్ఛ నాగాయలంక సొసైటీ, గ్రామ పంచాయతీ సహకారంతో నిర్వహించిన కార్యక్రమాలు జయప్రదం కావటం పట్ల బుద్ధప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధాన కారకులైన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ జయరామిరెడ్డి, ఆ శాఖ సంయుక్త సంచాలకుడు మల్లిఖార్జున్, స్వచ్ఛ నాగాయలంక సొసైటీ అధ్యక్షుడు గడ్డిపాటి సుధీర్‌బాబు, కార్యకర్తలు, అధికారులను బుద్ధప్రసాద్ ఘనంగా సత్కరించారు.