కృష్ణ

పార్టీ పట్టు మరింత పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, జనవరి 23: క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ పట్టును మరింతంగా పెంచేలా ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలను అందరి దరిచేర్చే క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చొరవ చూపాలన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం పోరంకిలోని పెనమలూరు శాసనసభ్యుడు బోడే ప్రసాద్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి ఉమా మాట్లాడుతూ ప్రధానంగా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం పనిచేయాలన్నారు. గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టాలని హితవు పలికారు. అవి పార్టీకి చెడుపేరు తెస్తాయనే విషయాన్ని గ్రహించాలన్నారు. రానున్న ఎన్నికల్లోనూ పార్టీ అఖండ విజయానికి నాయకులు, కార్యకర్తలు సాయశక్తులా కృషి చేయాలన్నారు. సుదీర్ఘంగా ఐదు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పార్టీ ఘన విజయానికి అన్నిస్థాయిల్లోనూ తీసుకోవలసిన చర్యలు, చిన్నా పెద్ద స్థాయి నాయకుల్లో రావలసిన మార్పులతో పాటు అధికారులలో సమన్వయ లోపం కారణంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి తీసుకువాల్సిన చర్యలు వంటి అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈసందర్భంగా నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో మంత్రి రవీంద్ర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జలవనరులతో జన్మ ధన్యమయ్యంది

మైలవరం, జనవరి 23: మైలవరం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని కీలకమైన జలవనరుల శాఖ ద్వారా రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించి రైతుల రుణం తీర్చుకుంటున్నానని, ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు కల్పించిన జలవనరుల శాఖ ద్వారా జన్మ ధన్యమైందని ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ శాఖ ద్వారా ఇప్పటి వరకూ 51వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. మండలంలోని పుల్లూరు శివారు దాసుళ్ళపాలెంలో 2కోట్ల 22 లక్షల 68వేల రూపాయల వ్యయంతో నిర్మించబోయే ఎత్తిపోతల పథకానికి మంత్రి ఉమ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 300 అడుగుల కృష్ణానది నీటిని ఎత్తిపోసి వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి రెండోసారి నందిగామలో గెలిచానన్నారు. అదే స్ఫూర్తితో మైలవరం నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి ప్రజల ముందుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. మహిళాలోకం అంతా కదలివచ్చి దాసుళ్ళపాలెంలో ఘన స్వాగతం పలికారని ఎన్ని జన్మలెత్తినా ఈ ఆదరణను మరువలేనని అన్నారు. గడచిన 43 ఏళ్ళలో 81లక్షల ఐడిసి ద్వారా ఖర్చు చేశారని, కేవలం మూడున్నరేళ్ళలో తన హయాంలో 17.19 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. జిల్లాలో 91 స్కీంల నిర్మాణానికి 173 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించానన్నారు. ఈశాఖ ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు తెచ్చే అవకాశం ఏర్పడిందన్నారు. 40 ఏళ్ళుగా పులివెందులకు కృష్ణా జలాలు ఇవ్వలేకపోయారని, కుప్పం కన్నా ముందే పులివెందులకు నీరిచ్చి అన్నమాట నిలబెట్టుకున్నానని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎన్ని అవాంతరాలెదురైనా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. సీఎంపై నమ్మకంతోనే రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా 33వేల ఎకరాలను ఇచ్చారన్నారు. ఇప్పటి వరకూ తాను 51 సార్లు పోలవరం పనుల పరిశీలనకు వెళ్ళానని, ఇప్పటికి 53 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఫిబ్రవరి నుండి పనులు మరింత వేగవంతం కానున్నాయన్నారు. ఎట్టి పరిస్థితులలో 2019 నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. పట్టిసీమ పూర్తి చేసే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శపథం చేసిన ప్రతిపక్షానికి చెందిన అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారని మంత్రి ఉమ ప్రశ్నించారు. జన్మభూమిలో వచ్చిన అర్జీలన్నీ పరిష్కరించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ రాము, పుల్లూరు సర్పంచ్ రాములు, పార్టీ నేతలు కుమార్‌రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు.