కృష్ణ

ఉత్సాహంగా జెక్‌ఫెస్ట్-2018 వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 16: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైన జెక్‌ఫెస్ట్-2018 వేడుకలు శుక్రవారం అత్యంత ఉత్సాహంగా సాగాయి. సాహిత్య, సాంస్కృతి పోటీల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. సాహిత్య పోటీల్లో తెలుగు కవితలు విభాగంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల, స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలు ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. డిబేట్‌లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలు, మిమిక్రీలో లక్కిరెడ్డి బాలిరెడ్డి, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్, తాక్షణిక చిత్రలేఖనం పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల కైవసం చేసుకుంది. కళాశాల చైర్మన్ డా. వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కరస్పాండెంట్ సత్యనారాయణరావు, ప్రమోటర్ సొసైటీ అధ్యక్షుడు సుబ్బారావు, ప్రిన్సిపాల్ రవీంద్రబాబు, వైస్ ప్రిన్సిపాల్ డా. బుర్రా కరుణ కుమార్ తదితరులు పోటీలను పర్యవేక్షించారు. ఉదయం తిరుమల తిరుపతి ఆస్థాన విధుషీమణి పద్మశ్రీ అవసరాల కన్యాకుమారి వీణా వాదన ప్రేక్షకులను అలరించింది. వీణపై ఆమె అద్భుతమైన సంగీతాన్ని పలికించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. అనంతరం అంతర్జాతీయ ఇంద్రజాల విన్యాసకుడు సామల వేణు ప్రదర్శించిన ఇంద్రజాల ప్రదర్శన అబ్బురపర్చింది. పద్మశ్రీ కన్యాకుమారి, సామల వేణులను కళాశాల చైర్మన్ డా. వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కరస్పాండెంట్ వల్లూరుపల్లి సత్యనారాయణ తదితరులు ఘనంగా సత్కరించారు.

ఆటలతో మానసిక ఒత్తిళ్లు దూరం

నాగాయలంక, ఫిబ్రవరి 16: ఉపాధ్యాయులు నిత్యం వృత్తిపరంగా ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లను తొలగించుకునేందుకు వివిధ ఆటలలో పాల్గొనవల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీపీ సజ్జా గోపాలకృష్ణ అన్నారు. స్థానిక జెడ్పీ హైస్కూల్ క్రీడామైదానంలో శుక్రవారం ఉపాధ్యాయుల ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జా మాట్లాడుతూ దివంగత మాజీ వ్యాయామోపాధ్యాయుడు వర్రే రాజేంద్రప్రసాద్ జ్ఞాపకార్ధం జిల్లాలో మరే మండలంలో లేని విధంగా నాగాయలంక మండలంలో మాత్రమే ప్రతి సంవత్సరం విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆటల పోటీలను నిర్వహించటం ముదావహమన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంఇఓ టివిఎం రామదాసు, వ్యాయామోపాధ్యాయులు ఆలా రమేష్, రత్నకుమారి, ప్రధానోపాధ్యాయుడు పద్యాల వెంకట నాగేశ్వరరావు పర్యవేక్షించారు.