కృష్ణ

మోపిదేవి పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఐఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, ఫిబ్రవరి 16: స్థానిక పీహెచ్‌సీని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. అమృత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాన మంత్రి మాతృవందన పథకం ద్వారా లబ్ధిదారుల జాబితాను తనిఖీచేసి ఆధార్, రేషన్ కార్డుల నమోదు తదితర విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతృవందన పథకం కింద గర్బిణులకు మొదటి మూడు నెలల్లో ఆసుపత్రిలో నమోదైన వెంటనే రూ.1000 అందచేయటం జరుగుతుందని, ఆరు నెలలు పూర్తయిన వెంటనే రూ.2వేలు అందించటం జరుగుతుందని, ప్రభుత్వాసుపత్రిలో కాన్పు జరిగితే రూ.1000 పారితోషికం అందచేయటం జరుగుతుందని, శిశువుకు మూడు నెలల వరకు క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ వేయించుకున్న అనంతరం రూ.2వేలు అందజేయటం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఇఓ ఎఎస్‌ఎస్‌ఎన్ మూర్తి, పీహెచ్‌ఎన్ ధనలక్ష్మి, ఎవి రమణ తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ వ్యర్ధాలు దగ్ధం చేయొద్దు

మండవల్లి, ఫిబ్రవరి 16: గ్రామంలోని చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎత్తివేయకుండా అక్కడే దహన చేయటం వల్ల కలుషిత వాయువులు వెలువడి ప్రజారోగ్యాన్ని దెబ్బతిస్తుందని స.హ.ప్ర. ఐక్యవేదిక రాష్టక్రార్యదర్శి ఎల్. ఎస్.్భస్యరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గ్రామసభలో పలుసార్లు ఫిర్యాదు చేసిన పంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆయనన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుండి మిథేన్ అనే శక్తివంతమైన వాయువు విడుదల అవుతుందని, ఇది గాలిలో కలిసి ప్రజలకు హాని కల్గిస్తుందని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ రసాయనాలు ముక్కు, నోరు ద్వారా మానవ శరీరాల్లోకి ప్రవేశించి చర్మ వ్యాధులు, క్యాన్సర్, ధైరాయిడ్, హార్మోన్ల సమస్యలు వస్తున్నాయని ఆయన వాపోయారు. ప్లాస్టిక్‌లో వాడే సీసం, కాడ్మియం అనే రసాయనాలు ఎక్కువ ఉప్టోగ్రతలో కరిగి ఆహార పదార్థాల ద్వారా శరీరంలోని మెదడు, నాడీ వ్యవస్థ, వెన్నుముక వ్యాధులు సంభవిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారని, అధికారులు ఇప్పటికైన స్పందించి ప్లాస్టిక్ వ్యర్ధాలను గ్రామ సమీపంలో కాల్చవద్దని ఆయన కోరారు.