కృష్ణ

విభజన హామీలపై ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 25: రాష్ట్ర విభజనతో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేసే విధంగా కేంద్రంపై అన్ని పక్షాలు ఒత్తిడి తేవాలని శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పిలుపునిచ్చారు. విజయకృష్ణ జనజాగృతి సంస్థ, ప్రత్యేక హోదా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక టౌన్‌హాలులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపించారు. ఎమ్మెల్సీ అర్జునుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. విభజన హామీల అమలు కోసం ఇప్పటి వరకు కేంద్రంతో సక్యతతో వ్యవహరించామన్నారు. కానీ కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఆందోళనకు సిద్ధమయ్యాయన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ ఎంపీలు పోరాట పటిమ కనబర్చారన్నారు. కానీ కేంద్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం గర్హనీయమన్నారు. ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టీడీపీ జిల్లా కార్యదర్శి పివి ఫణికుమార్, వైసీపీ నాయకులు షేక్ సలార్ దాదా, బొర్రా విఠల్, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ మతీన్, బుల్లెట్ ధర్మారావు, పట్టణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కోగంటి సాయి మోహనరావు, బందరు బంధువు జొన్నలగడ్డ లక్ష్మీకాంతం, సీపీఎం నాయకుడు కొడాలి శర్మ, సీపీఐ నాయకుడు లింగం ఫిలిప్, జనజాగృతి సంస్థ కార్యదర్శి శికినం కాళిదాసు తదితరులు పాల్గొన్నారు.