కృష్ణ

రాష్ట్రంలో పట్టణీకరణతో తలసరి ఆదాయం పెంపునకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 30: రాష్ట్రంలో పట్టణీకరణ, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా. పి నారాయణ అన్నారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో రూ.5కోట్ల వ్యయంతో నిర్మించనున్న పురపాలక సంఘ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులకు శనివారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ అండ్ బి శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ ప్యానల్ స్పీకర్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు కూడా హాజరై భూమిపూజ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో 75 శాతం ప్రజలు పట్టణాలు, నగరాల్లో జీవిస్తున్నారన్నారు. తలసరి ఆదాయం ఎంతో ఎక్కువగా ఉంటుందన్నారు. మన దేశంలో 32శాతం మంది, రాష్ట్రంలో 28శాతం మంది మాత్రమే పట్టణాల్లో నివశిస్తున్నారని తెలిపారు. పట్టణీకరణ పెరిగితే ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయిందని ఫలితంగా తెలంగాణ తలసరి ఆదాయం లక్షా 35వేల రూపాయలు కాగా మన రాష్ట్రంలో లక్షా 7వేల రూపాయలు మాత్రమే ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టణాలు, నగరాల్లో వౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించారని తద్వారా పరిశ్రమలు ఏర్పాటై ప్రజల తలసరి ఆదాయం పెరగనుందని చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్‌లో వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఆధునిక పరిజ్ఞానంతో యూనిట్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. తొలుత శ్రీకాకుళంను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశామన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే యూనిట్ విజయవంతమైతే అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో 5.50లక్షల వీధి దీపాలకు ఎల్‌ఇడి బల్బులు అమర్చే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పటికే 3.50లక్షల ఎల్‌ఇడి బల్బులను అమర్చినట్లు చెప్పారు. మచిలీపట్నం ప్రధాన సమస్యగా మారిన ఓపెన్ డ్రైనేజీని మెరుగుపర్చేందుకు 2016-17 కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదనలు పెడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేయిస్తామన్నారు. భవన నిర్మాణ ప్లాన్‌ల కోసం నెలల తరబడి మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ల చుట్టూ తిరగాల్సిన పని లేదన్నారు. ఆన్‌లైన్‌లోనే ప్లాన్ అప్రూవల్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ రహదారులు బాగుంటేనే వ్యాపారం పెరిగి రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. గత పదేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకులు రహదారుల అభివృద్ధిని కుంటుపర్చారన్నారు. రాష్ట్ర విభజన కారణంగా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. నదుల అనుసంధానం, పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణం ఎంతో ధైర్యంగా చేపట్టారని, భూగర్భ జలాల పెంపుకు పంట సంజీవని, నీరు-చెట్టు కార్యక్రమాలు వరంగా మారుతున్నాయన్నారు. పోర్టు రోడ్డు సెంటర్ లైటింగ్, డివైడర్స్ ఏర్పాటుకు రూ.3.50లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దేశంలోనే రెండవ పురపాలక సంఘముగా ఎంతో ఘన కీర్తి కలిగిన మచిలీపట్నం మున్సిపాల్టీకి పూర్వ వైభవం రానుందన్నారు. పోర్టు కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, డివైడర్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధికి రూ.13కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశామని, పుష్కర నిధుల కింద ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి సిద్ధా రాఘవరావుకు వినతిపత్రం అందజేశారు. ఎంపి కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ 190 యేళ్ళ చరిత్ర కలిగిన మచిలీపట్నం మున్సిపాల్టీ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. గతంలో ఇక్కడి నుండి గోవాకు రైలు మార్గం ఉండేదన్నారు. దీని తర్వాత మున్సిపాల్టీలుగా ఏర్పడినవి పట్టణాలు, నగరాలుగా అభివృద్ధి చెందాయన్నారు. మచిలీపట్నం మాత్రం ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో కార్పొరేషన్ స్థాయిలో ఆధునాతన మున్సిపాల్టీ భవన నిర్మాణం జరుగుతుండటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం (చంటి), టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, ఆర్డీవో సాయిబాబు, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, టిడిపి నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.