కృష్ణ

టెన్త్ పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 13: ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. నగరంలోని క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం ఆయన జిల్లా వ్యాప్తంగా ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, స్పెషల్ ఆఫీసర్లతో పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఉపాధి హామీ, వైద్య ఆరోగ్య, తాగునీరు, అర్జీల పరిష్కారం వంటి పలు అంశాలపై సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిబంధనలను ఉల్లంఘించరాదన్నారు. జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయాలన్నారు. విద్యార్థులకు హాల్ టిక్కెట్లను ఇంటర్‌నెట్ ద్వారా డౌన్‌లోడ్‌తోపాటు సంబంధిత పాఠశాలల్లో అందజేసేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడానికి 63010 67397 కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని విద్యార్థులు సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, మండల స్థాయిలో మండల తహశీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్‌లు ప్రతి రోజూ పరీక్షా కేంద్రాలను పరిశీలించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో వెంటిలేషన్ ఉండాలని తాగునీరు, ఫర్నిచర్ ఏర్పాటు చేయాలన్నారు. బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలని ఈ-హాజరు నూరు శాతం జరగాలన్నారు.