కృష్ణ

సివిల్ కోర్టు నిర్మాణానికి స్థల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, మార్చి 13: మైలవరంలో నూతనంగా నిర్మించబోయే సివిల్ కోర్టు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం పరిశీలించారు. సివిల్ కోర్టు నిర్మాణానికి సంబంధించి ఎప్పటి నుండో స్థలాన్ని మంజూరు చేయాలని మైలవరం బార్ అసోసియేషన్ సభ్యులు అనేకమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించారు. ఈనేపధ్యంలో స్థానిక మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు స్థానిక తహశీల్దార్ శివయ్య స్థలాన్ని పరిశీలించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న పాత ఎనె్నస్పీ క్వార్టర్స్ స్థలం ఎర్‌ఎస్ నెంబర్ 94/2లోని ఒక ఎకరా 50 సెంట్ల స్థలాన్ని పరిశీలించి కోర్టు భవనాల నిర్మాణానికి ఇవ్వటానికి అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం బార్ ప్రధాన కార్యదర్శి పీవీ సాంబశివరావు, న్యాయవాదులు సత్యనారాయణ, కిషోర్, రామకృష్ణ, ఆర్‌ఐ లక్ష్మణరావు, వీఆర్వో రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ ఎదుటస్వర్ణకారుల ధర్నా

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 13: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని, స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్ పీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన హామీ ప్రత్యేక హోదాను అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 272 జీవోను సరళీకృతం చేసి స్వర్ణకారులపై పోలీసుల వేధింపులను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, పట్టణ అధ్యక్షుడు చిట్టూరి శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి గడ్డం రాజు, ప్రధాన కార్యదర్శి మునిపల్లి సుబ్బారావు, వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.