కృష్ణ

పాలకాయతిప్ప బీచ్ గేటుకు తాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు: సముద్రంలో అలజడి వాతావరణం నెలకొనటంతో పర్యాటకులకు ఎటువంటి ముప్పు కలగరాదని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాలకాయతిప్ప బీచ్ గేటుకు బుధవారం తాళాలు వేశారు. తహశీల్దార్ అశ్వర్ధ నారాయణరెడ్డి, మండల ప్రత్యేక అధికారి, డీఎల్‌పీఓ సత్యనారాయణ, హంసలదీవి గ్రామ కార్యదర్శి రామసుబ్రహ్మణ్యం తదితరులు సముద్రం వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అలల ఉధృతంగా ఉండటంతో బీచ్ గేటుకు తాళాలు వేసి పర్యాటకుల రాకపోకలను నిలుపుదల చేశారు. ఫారెస్ట్ సిబ్బంది నియమించిన వాచ్‌మెన్లను కాపలాగా పెట్టారు.

టీడీపీ సైకిల్ ర్యాలీ

కూచిపూడి, ఏప్రిల్ 25: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చేపట్టిన వివిధ ఆందోళన కార్యక్రమాలు కేంద్రంలోని బీజెపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. పామర్రు నియోజకవర్గం పరిధిలోని మొవ్వ మండలం నిడుమోలులో ఆమె సైకిల్ ర్యాలీని బుధవారం ప్రారంభించారు. మండల పరిధిలోని నిడుమోలు, మంత్రిపాలెం, అవిరిపూడి, పాలంకిపాడు, చినముత్తేవి, కారకంపాడు మీదుగా అయ్యంకి వరకు సైకిల్ యాత్ర సాగింది. టీడీపీ మండల అధ్యక్షుడు తాతా వీర దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సొంతింటి కలను నెరవేర్చిన ఘనత టీడీపీదే

కోడూరు, ఏప్రిల్ 25: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని సాలెంపాలెం గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. ఎన్టీఆర్ స్వగృహ పథకం కింద గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. ఇసుక సరఫరా, బిల్లుల మంజూరుపై అరా తీశారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు సత్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి, డీఎల్‌పీఓ సత్యనారాయణ, ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి, హౌసింగ్ ఎఇ నాయక్, తహశీల్దార్ అశ్వర్ధ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ‘మరకాని’

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 25: రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన మాజీ ఏఎంసీ చైర్మన్ మరకాని పరబ్రహ్మం బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గొల్లపూడిలోని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ నల్లారి కిషన్ కుమార్ రెడ్డితో పాటు సహచర డైరెక్టర్లతో కలిసి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అమర్‌నాధ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య తదితరులు హాజరయ్యారు.