కృష్ణ

మంగినపూడి బీచ్ సుందరీకరణ పనులను సత్వరమే పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మంగినపూడి బీచ్ సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. సుందరీకరణ పనులపై బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పర్యాటక శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇతర ప్రాంతాల్లో ఉన్న బీచ్‌ల సుందరీకరణ పనులను పరిశీలించి వాటిలో మెరుగైన సుందరీకరణ పనులను మంగినపూడి బీచ్‌లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా సుమారు రూ.2కోట్లతో బీచ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు పంపగా కోటి రూపాయలు ఇచ్చేందుకు కార్పొరేషన్ ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ నిధులతో మంగినపూడి బీచ్‌లో హైమాస్ట్ విద్యుత్ దీపాలు, డ్రస్సింగ్ రూమ్‌లు తదితర సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. యువ భవన్ నిర్మాణానికి సంబంధించిన భూమి డ్రైనేజీ శాఖ ఆధ్వర్యంలో ఉందని, ఆ భూమిని యువ భవన్‌కు బదలాయించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపాలని డ్రైనేజీ డీఇకి సూచించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ ఎస్‌ఇ గంగాధరరెడ్డి, ఎంపీడీవో జివి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సబ్ జైలు తనిఖీ చేసిన అదనపు జిల్లా న్యాయమూర్తి

నందిగామ, ఏప్రిల్ 25: మండల న్యాయసేవాధికార కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ మరియు 16వ అదనపు జిల్లా న్యాయమూర్తి బి పాపిరెడ్డి స్థానిక సబ్‌జైలును పరిశీలించి ఖైదీల వివరాలు, వారికి అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగి సమాజంలో మంచిగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి మల్లికార్జునరావు, జైలు తనిఖీ సభ్యులు సిహెచ్ శ్రీనివాస్, ఇ రంగారావు, లీగల్ సర్వీసెస్ సభ్యులు టి కోటేశ్వరరావు, లీగల్ ఎయిడ్ క్లినిక్ న్యాయవాది రవికుమార్, సబ్ జైలు సూపరింటెండెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.