కృష్ణ

మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం స్థానిక టౌన్‌హాలులో మత్స్యకారులకు 75 శాతం సబ్సిడీపై వలలు, మోపెడ్లు, జిపిఎస్ సెట్లను పంపిణీ చేశారు. 205 మంది మత్స్యకారులకు రూ.73లక్షలు విలువైన వేట పరికరాలను సుమారు రూ.55లక్షలు సబ్సిడీతో అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ సముద్రం లోపల వేటకు ఉపయోగించే స్టీల్ బోట్లు, మత్స్యకారులు కొనుగోలు చేసేందుకు 50 శాతం సబ్సిడీతో ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ఈ బోటు విలువ సుమారు రూ.80లక్షలు ఉంటుందన్నారు. బోటు కావల్సిన వారు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుతో సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రతి మత్స్యకారుడు చంద్రన్న బీమా కింద నమోదు కావాలన్నారు. మత్స్యకారుల భూముల్లో సొంతంగా సాగు చేసుకునేందుకు బ్యాంక్‌ల ద్వారా రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి మత్స్యకారుడికి పెన్షన్ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో మత్స్యకారులకు ఇస్తున్న ఆయిల్ సబ్సిడీని అధ్యయనం చేసి మన రాష్ట్రంలో రిజిస్ట్రర్ అయిన అన్ని బోట్లకు సబ్సిడీ ఇచ్చేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి తెలియచేశామన్నారు. వేట నిషేద సమయంలో ఇచ్చే భృతిని ఒకే కుటుంబంలో ఇద్దరూ లేక ముగ్గురు ఉన్నా కూడా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదనలు ఉన్నాయని, ఆమోదం తెలిపిన వెంటనే కుటుంబంలో వేట చేసే వారందరికీ భృతిని ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, వైస్ చైర్మన్ అచ్యుతరావు, మత్స్యకార సంఘం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ నాగరమేష్, మత్స్యశాఖ ఎడి ఎవి రాఘవరెడ్డి, ఎఫ్‌డిఓ రాజ్‌కుమార్, ఎంపీఏలు తదితరులు పాల్గొన్నారు.