కృష్ణ

జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ. 23,695 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 23,695 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం మీటింగ్ హాలులో మంగళవారం సాయంత్రం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన బ్యాంకర్ల సమావేశంలో రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ గత సంవత్సరం రూ. 19,817 కోట్ల రుణ ప్రణాళిక అమలు చేశామని, ఈ సంవత్సరం రూ. 23,695 కోట్లతో విడుదల చేశామని, గతంతో పోల్చితే 19.57 శాతం ఎక్కువని చెప్పారు. 2018-19 సంవత్సరానికి రూ. 23,695.28 కోట్లకు విడుదల చేసిన వార్షిక రుణ ప్రణాళిక ద్వారా 12,25,555 మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ఈ ప్రణాళికలో రూ. 9,661.23 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించటం ద్వారా 8,23,097 మంది రైతులకు లబ్ధి చేకూర్చనున్నామన్నారు. పంట రుణాలు రూ. 6,585 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ. 2,794.43 కోట్లు, వ్యవసాయ ఇన్స్‌స్ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించి రూ. 50.92 కోట్లు, అనుబంధ రంగాలకు రూ. 230.88 కోట్లు రుణాలుగా అందించనున్నామని తెలిపారు. ప్రాధాన్యత రంగానికి సంబంధించి రూ. 15,694 కోట్ల రుణాలను అందించడం ద్వారా లక్షలాది మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. లఘు, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి రూ. 4,272,75 కోట్లు రుణాలుగా అందించడం ద్వారా 92,980 మందికి సహాయం అందించాలని లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ తెలిపారు. ఇతర ప్రాధాన్యత రంగాలకు సంబంధించి రూ. 1760 కోట్లు రుణాలు అందించడం ద్వారా 90,527 మందికి లబ్ధిచేకూర్చాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ప్రాధానే్యతర రంగానికి సంబంధించి రూ. 8,001 కోట్లు రుణాలుగా అందించడం ద్వారా 2,18,951 మందికి లబ్ధి చేకూర్చనున్నామని కలెక్టర్ లక్ష్మీకాంతం వివరించారు.

విభిన్న ప్రతిభావంతులకు అన్నివిధాలా చేయూత
* కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడి

విజయవాడ, మే 15: జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు చేయూత కార్యక్రమం ద్వారా వారి అవసరాలను గుర్తించి ఉపకరణాలు, బస్సు, రైల్వే పాసులను ఉచితంగా అందిస్తూ ఫామ్-6 ద్వారా ఓటర్లుగా నమోదు చేస్తున్నామని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం చెప్పారు. విభిన్న ప్రతిభావంతులను ఓటర్లుగా నమోదు, వారికి కల్పించాల్సిన సదుపాయాలపై చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సిసోడియా అధ్యక్షతన మంగళవారం జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో 48వేల మంది సాధికార మిత్రల ద్వారా అర్హులైన 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేస్తున్నామన్నారు. జిల్లాలో సుమారు లక్షా 7వేల మందిని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించామని, సదరమ్ ప్రత్యేక శిబిరాల ద్వారా వికలాంగత్వ శాతాన్ని నిర్థారించే సర్ట్ఫికెట్లను జారీ చేస్తున్నామన్నారు. అదే సమయంలో ఓటర్లుగా నమోదు కానివారిని నమోదు చేస్తున్నామని తెలిపారు. ఓటర్ల నమోదుపై అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించామని, బూత్ స్థాయి ఏజెంట్‌ను నియమించుకుని విభిన్న ప్రతిభావంతులను ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను జిల్లాలో చేపట్టామన్నారు. ప్రతి కళాశాలలోనూ నోడల్ ఆఫీసర్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ కొత్త ఓటర్ల నమోదుకు చర్యలు తీసుకున్నామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ-ఓటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని, తద్వారా విభిన్న ప్రతిభావంతులు, వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ విధానాన్ని మన దేశంలో కూడా అమలు చేస్తే బాగుంటుందని సీఈవో దృష్టికి తెచ్చారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లో విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రతి వెయ్యి మంది జనాభా ఆధారంగా 700 మంది ఓటర్ల రేషియో ఉండాలన్నారు. విభిన్న ప్రతిభావంతులు ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువ మంది పాల్గొనేలా చూడాలని కలెక్టర్ లక్ష్మీకాంతం సూచించారు. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఇన్‌ఛార్జి కమిషనర్ కుమార్ రాజా మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులను ఓటర్లుగా నమోదు చేస్తున్నామని, ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్‌లు, ట్రైసైకిళ్లు వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతులకు ఇంకా అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, వీల్‌చైర్ల ఏర్పాటు, ప్రత్యేక క్యూలైన్, టెంపరరీ ర్యాంపు ఏర్పాటు చేయాలని సీఈవో దృష్టికి తెచ్చారు. ఈవీఎంలపై బ్రెయిలీ లిపిలో పార్టీ పేరు, గుర్తుతో పాటు స్పీచ్ ఔట్ సదుపాయం కూడా ఉండాలన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ ప్రధాన కార్యదర్శి రామసుబ్బయ్య మాట్లాడుతూ జిల్లాలో చేయూత కార్యక్రమం ద్వారా విభిన్న ప్రతిభావంతులకు సదుపాయాల కల్పనపై కలెక్టర్ లక్ష్మీకాంతంకు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్ పుల్లయ్య, గుంటూరు జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్, ప్రకాశం జిల్లా డిప్యూటీ కలెక్టర్ హేమసుందర్ వెంకట్రావ్, పశ్చిమ గోదావరి జిల్లా వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు ప్రసాదరావు, కృష్ణా జిల్లా సహాయ సంచాలకులు నారాయణరావు కూడా పలు సూచనలు చేశారు. వర్క్‌షాపులో ఎన్నికల సంఘం ఓఎస్డీ వెంకటేశ్వరరావు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులు, సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.