కృష్ణ

విద్యావిధానంలో ‘కృష్ణా’ కొత్త ఒరవడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: విద్యా విధానంలో కృష్ణా విశ్వ విద్యాలయం నూతన ఒరవడి సృష్టిస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. విదేశీ విద్యపై మరింత అవగాహన కల్పించేందుకు గాను కృష్ణా విశ్వవిద్యాలయం, కాకినాడ జెఎన్‌టీయు మలేసియాలోని లింకన్ విశ్వవిద్యాలయంతో ఎంఓయు కుదుర్చుకోవడం శుభ పరిణామమన్నారు. శుక్రవారం కృష్ణా విశ్వ విద్యాలయం వేదికగా రెండు యూనివర్శిటీలు లింకన్ యూనివర్శిటీతో ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుతోపాటు గ్రీన్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ డా. సిఎల్ వెంకట్రావ్, లింకన్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అమీయా బహుమిక్, కృష్ణా విశ్వ విద్యాలయం వైస్‌ఛాన్సలర్, జెఎన్‌టియు ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అయిన ప్రొ. సుంకరి రామకృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ విదేశీ విద్యను పరిచయం చేయడం విద్యాభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు. కృష్ణా వర్సిటీ, జెఎన్‌టీయు వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు మలేసియాలో కొనసాగుతున్న విద్య విధానాన్ని తెలుసుకుని అభివృద్ధి పర్చేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఆ దేశ విద్యార్థులు, అధ్యాపకులు మన దేశ విద్యా విధానంలోని మెళకువలు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. పులిపాటి కింగ్, జెఎన్‌టియు రిజిస్ట్రార్ ప్రొ. వివి సుబ్బారావు, మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.