కృష్ణ

‘పోర్టు’ ఇబ్బందులు తొలగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార చర్యలు తీసుకుంటామని పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు రైతులకు హామీ ఇచ్చారు. పోర్టు ప్రతిపాదిత గ్రామాల రైతులతో గురువారం స్థానిక టౌన్ హాలులో ముడ అధికారులతో కలిసి ఎంపీ కొనకళ్ల నారాయణరావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ నారాయణరావు మాట్లాడుతూ భూసేకరణ నోటిఫికేషన్‌తో నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్‌లకు అవకాశం కల్పించేందుకు సీఎంతో మాట్లాడతానన్నారు. ఓడరేవు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. పోర్టు కోసం భూములు ఇచ్చే రైతులకు ఎటువంటి నష్టం జరగకూడదన్న ఉద్దేశ్యంతో భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ హామీతో బ్యాంక్ ద్వారా రూ.1100 కోట్ల మేర రుణం పొంది సంబంధిత మొత్తాన్ని పరిహారంగా రైతులకు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చినా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా మన ప్రాంత అభివృద్ధి కోసం రైతులంతా ముందుకు వచ్చి భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ముడ వీసీ విల్సన్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపిచంద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.