కృష్ణ

మానసిక వ్యాధిగ్రస్తులకు సామాజిక భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాలో నిరాదరణకు గురైన మానసిక వ్యాధి గ్రస్తులు, మానసిక వికలాంగుల రక్షణ, సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత కోసం గ్రామ, మండల స్థాయి కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ తన బంగ్లాలో జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మానసిక వ్యాధిగ్రస్తులు, మానసిక వికలాంగులను గుర్తించి వారికి సామాజిక భద్రత, రక్షణ, ఆరోగ్య పరిరక్షణ కల్పించేందుకు అమలులో ఉన్న చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. ఈ అంశంలో సమగ్ర సమాచారంతో కూడిన పోస్టర్లు, కరపత్రాలు ముద్రించి సరైన ప్రచారం కల్పించాలన్నారు. ఇందు కోసం గ్రామ, మండల స్థాయిలో కమిటీలు వేయాలన్నారు. ప్రతి నెలా కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, గ్రామైఖ్య, సాధికారమిత్రులు సమావేశాల్లో పాల్గొని చర్చించాలన్నారు. జిల్లాలో 45వేల మంది సాధికారమిత్రలు ఉన్నారని, వీరు ఇంటింటికి వెళ్లి నిరాదరణకు గురైన మానసిక వ్యాధిగ్రస్తులు, వికలాంగుల వివరాలు సేకరించాలన్నారు. అంగన్‌వాడీల ద్వారా ఈ-ప్రగతి అమలులో భాగంగా ఈ-అంగన్‌వాడీల ద్వారా పిల్లల బరువు, ఎత్తు ఎప్పటికప్పుడు నమోదు చేసి వారిలో శారీరక, మానసిక ఎదుగుదలను గమనిస్తుండాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పిఆర్ రాజీవ్, డీఆర్‌డీఎ పీడీ చంద్రశేఖరరాజు, వికలాంగుల శాఖ ఎడీ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.