కృష్ణ

రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 5: కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ కొత్తూరు సుబ్బారావు అన్నారు. బుధవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ బందరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. బందరు నియోజకవర్గ కన్వీనర్ కూనపరెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సుబ్బారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయంటే అది కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం వల్లేనన్నారు. కేంద్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నా వాటిని ప్రజలకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇదే విషయాన్ని ప్రతి బీజేపీ కార్యకర్త ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.