కృష్ణ

శాస్ర్తియ విద్యాబోధనకు ఆధునికత జోడింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విద్యార్థులకు శాస్ర్తియ విద్యాబోధనతో ఆధునికతను జోడించి పాఠ్యాంశాలను సులభంగా విశదీకరించే రీతిలో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అన్నారు. పటమట గోవిందరాజు ధర్మశాల ట్రస్టు నగరపాలక పాఠశాలలో ప్రవాసాంధ్రుల సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 440కు పైగా ప్రభుత్వ పాఠశాలల డిజిటలీకరణలో భాగంగా డిజిటల్ తరగతి గదుల నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటికే 260కు పైగా పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులను పూర్తి చేశామని, ఈ మాసాంతానికి నూరుశాతం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. విద్యాధిక దేశంగా రూపొందితే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. విద్యాధిక సామ్రాజ్యాన్ని నెలకొల్పే విధంగా జిల్లాలోని అన్ని పాఠశాల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. సుస్థిర అభివృద్ధి చెందిన దేశాలు ప్రగతికి చిహ్నాలుగా ఉంటాయని, అభివృద్ధి, సంక్షేమం మనిషికి రెండు కళ్లు లాంటివన్నారు. మానవాభివృద్ధే నిజమైన అభివృద్ధి అని, దీనిలో భాగంగా విద్య, ఆరోగ్యం అందరికీ అందాలన్నారు. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన ప్రజల సంతృప్త స్థాయి నివేదికలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానాన్ని పొందిందన్నారు. జిల్లాలో 84 శాతం పైగా ప్రజలు అభివృద్ధి, సంక్షేమం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మంచినీరు, విద్యుత్, టాయిలెట్లు, ప్రహరీ గోడలు, ఆటస్థలాలు, ఫర్నిచర్ వంటి వౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అవసరమైనచోట అదనపు తరగతి గదులు నిర్మస్తున్నామని, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వర్చువల్ క్లాస్‌రూమ్స్ బోధన పట్ల విద్యార్థులు ఆసక్తిగా ఉన్నారన్నారు. సైన్స్‌ను టెక్నాలజీతో జోడిస్తే అంతులేని అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని లక్ష్యసాధనకు కష్టపడి అనుకున్నది సాధించాలని సూచించారు. కాలాన్ని వృథా చేయవద్దని, అంతులేని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. చిన్ననాటి నుండి స్పష్టమైన విజన్ నిర్దేశించుకుని భాషపై పట్టు సాధించాలని, మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు బోధించారు. పాఠ్యాంశాలను విద్యార్థుల హృదయాన్ని తాకేవిధంగా ఉపాధ్యాయులు బోధించాలని, పాఠం అర్థమయ్యే రీతిలో స్పష్టంగా బోధించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు ఆఫీసరు కేడీవీఎం ప్రసాదబాబు, అల్బని ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ నిడమనూరు, స్థానిక కార్పొరేటర్ కె రమాదేవి, స్కూల్ మేనేజ్‌మెంట్ చైర్మన్ నజీర్ హుస్సేన్, డిప్యూటీ డీఈవో కె దుర్గాప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం డిజిటల్ క్లాస్ రూమ్‌లకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న దాతలను, జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్న కలెక్టర్‌ను పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.