కృష్ణ

స్వచ్ఛ సర్వేక్షన్ 2019లో మొదటి ర్యాంక్ సాధనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా నగర పరిధిలోని పబ్లిక్, కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్వహణలో మొదటి ర్యాంకు సాధనకు కృషి చేయాలని వీఎంసీ కమిషనర్ జే నివాస్ పేర్కొన్నారు. మంగళవారం వీఎంసీ కౌన్సిల్ హాల్లో ఇంజినీరింగ్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్‌పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం అభివృద్ధిపర్చిన మరుగుదొడ్లలో నాటి సౌకర్యాలు, వసతులన్నీ ఉన్నాయా లేదాన్న విషయంపై సమగ్ర పరిశీలన చేయాలన్నారు. వీఎంసీ స్కూల్స్‌లో ఇంకా మెరుగుపర్చాల్సిన మరుగుదొడ్లకు సంబంధించిన చర్యలను తక్షణమే తగు చర్యలు తీసుకుని ఆధునీకరించాలన్నారు. మరుగుదొడ్ల సివిల్, ఎలక్ట్రికల్, నీటి సరఫరా, బకెట్, మగ్, డస్ట్ బిన్ తదితర సౌకర్యాలన కల్పనలో ఎటువంటి నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొన్నారు. అదేవిధంగా నగరంలోన 3 సర్కిల్స్ పరిధిలో గుర్తించిన 18 టాయిలెట్లను మోడరన్ టాయిలెట్లుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. టాయిలెట్లలో ఒకదానిని బాత్‌రూమ్‌గా ఆధునీకరించాలని, ప్రతి టాయిలెట్స్‌లో వాష్ బేసిన్, పుష్ బటన్ టైప్ ట్యాప్‌లను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. మరుగుదొడ్లలో బాలికల, మహిళలకు ప్రత్యేకంగా శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైనచోట మొబైల్ యూరినల్స్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో సీఈ పి ఆదిశేషు, అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.