కృష్ణ

అన్ని వసతులు కల్పించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఫెథాయ్ తుఫాన్ నేపథ్యంలో తీర గ్రామాల్లో ఏర్పాటు చేసిన 20 పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఆదివారం రాత్రి పెదపట్నంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆయన సందర్శించి బాధితులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. బందరు, కృత్తివెన్ను, నాగాయలంక, కోడూరు మండలాల్లో మొత్తం 18 పునరావాస కేంద్రాల్లో 700 మందికి ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు. వీరందరికీ ఉదయం టీ, టిఫిన్‌తోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి కల్పించామన్నారు. చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందచేస్తున్నామన్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఏ చిన్న అసౌకర్యం కలిగినా అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు, మండల ప్రత్యేక అధికారి, సోషల్ వెల్ఫేర్ జెడీ ప్రసాదరావు, ఎంపీడీవో జివి సూర్యనారాయణ, తహశీల్దార్ కె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

జగన్ ప్రజాసంకల్పయాత్రతో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం

*వైసీపీ జిల్లా ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

నందిగామ, డిసెంబర్ 16: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని, పార్టీ అధికారంలోకి వస్తుందని శ్రేణుల్లో నూతనోత్సాహం, ఆత్మస్థైర్యం పెంపొందాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 8, 9 తేదీల్లో ఇచ్చాపురం వద్ద ప్రజా సంకల్ప యాత్ర ముగుస్తుందని, ఈ సందర్భంగా అక్కడ పైలాన్ శంకుస్థాపనతో పాటు భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభకు రాష్ట్ర, జిల్లా నాయకులు అందరూ పాల్గొంటారన్నారు. రాబోయే ఎన్నికల్లో 135- 145 స్థానాలతో వైసిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వస్తే రాజధాని తరలిపోతుందని అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తున్నారని, రాజధాని తరలింపు అంటూ ఉండదని, అక్కడే శాశ్వత భవన నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున సేకరించిన భూమిలో మిగిలిన భూమిని ఆ రైతులకే అప్పగించడం జరుగుతుందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నం జరిగితే దాన్ని ఆకతాయి చర్యగా చిత్రీకరించారన్నారు. డీజీపీ స్థాయి వ్యక్తి కూడా పూర్తి స్థాయి విచారణ చేయకుండా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారన్నారు. నాడు వైఎస్‌ఆర్ హయాంలో పరిటాల రవి హత్య కేసులో సీబీఐ విచారణ కోరితే వెంటనే అంగీకరించారని, విచారణలో క్లీన్ చిట్ లభించిందన్నారు. జగన్మోహనరెడ్డి అధికారంలోకి రాగానే ఈ ప్రాంత అభివృద్ధి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రధానంగా ఈ ప్రాంతం నుండి రాజధానికి త్వరగా రాకపోకలు సాగించేందుకు కృష్ణానదిపై వంతెన నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే సుబాబుల్ ధరను రూ.4400లు నిర్ణయించడం జరిగిందని, అప్పటికి ఇప్పటికీ ధరలు పెరిగినా ప్రభుత్వం సుబాబుల్ ధరను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.