కృష్ణ

న్యాయవాద గుమాస్తాల ధర్మ పోరాట దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : న్యాయవాద గుమస్తాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పట్టణ న్యాయవాద గుమస్తాల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయస్థానం ఎదుట ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు ప్రభుత్వ మాజీ విప్, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని)తో పాటు మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ న్యాయవాద గుమాస్తాలు చేస్తున్న పోరాట దీక్ష సరైనదేనని, న్యాయవాదులకు పెంచినట్లుగానే న్యాయవాద గుమాస్తాలకు కూడా మ్యాచింగ్ గ్రాంట్ నిమిత్తం రూ.4లక్షలు ఇవ్వటంతో పాటు న్యాయవాద గుమాస్తాలందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, జీవో నెం 4 ప్రకారం న్యాయవాద గుమాస్తాలకు ఇస్తున్న డెత్ బెనిఫిట్స్‌ను రూ.2లక్షలు నుండి రూ.4లక్షలకు పెంచాలని వక్తలు కోరారు. పట్టణ న్యాయవాద గుమస్తాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పివి ఫణికుమార్, వాడవల్లి సాయిబాబు నాయకత్వం వహించిన ఈ దీక్షలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. పట్టణ న్యాయవాదుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల వెంకట్రామయ్య, సమ్మెట శివ, జనసేన నాయకుడు లంకిశెట్టి బాలాజీ, శింగలూరి శాంతిప్రసాద్, 1వ వార్డు కౌన్సిలర్ బత్తిన దాసు, పలువురు న్యాయవాదుల దీక్షకు సంఘీభావం తెలిపారు.