కృష్ణ

వైభవంగా ఆది దంపతుల విహారయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి: ముల్లోకాలను పాలించే ఆదిదంపతులు భక్తుల జయ జయ ధ్వనుల నడుమ గురువారం సాయంత్రం సింహ వాహనాన్ని అధిష్టించి నగర విహారం చేస్తూ భక్తకోటికి చల్లని ఆశీస్సులను అందించారు. శ్రీ గంగా, పార్వతీ (దుర్గా) సమేత శ్రీ మల్లేశ్వరస్వామి సింహవాహనాన్ని అ ధిష్టించి గురువారం సాయంత్రం పాతబస్తీ వీధుల గుండా సాగుతూ నగర వాసులకు దివ్య ఆశీస్సులు అందచేశా రు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజైన గురువారం సా యంత్రం స్వామికి నగరోత్సవం నిర్వ హించారు. శ్రీమల్లిఖార్జున మహామండపం వద్ద నంది వాహనాన్ని పుష్పాల తో అలకరించి ఉత్సవమూర్తిని ఉంచా రు. రంగు రంగు విద్యుత్ లైట్లు నడు మ వాహనానికి ముందు కేరళ కళాకారులు సంప్రదాయరీతిలో మేళాతాళల తో వాయిద్యాలతో కోలాటం ప్రదర్శి స్తుండగా మహిళల సంకీర్తన ఏర్పాటు చేశారు. తొలుత ఈవో వీ కోటేశ్వరమ్మ దంపతులచేత స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్, ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గా ప్రసాద్ స్వామికి తొలిపూజ చేసి హారతి ఇచ్చిన అనంత రం స్వామి ఊరేగింపు కన్నుల పండు గగా బయలు దేరింది. ఈనగరోత్సవం పాతబస్తీలోని రథం సెంటర్ మీదుగా బ్రాహ్మణ వీధి రామాలయం, సుబ్రహ్మ ణ్యస్వామి ఆలయం వద్దకు చేరుకొం ది. అక్కడ నుండి బ్రాహ్మణవీధి మీదు గా కొత్త పేట నెహ్రూ బొమ్మ సెంటర్‌కు చేరుకుని అక్కడ నుండి తిరిగి కేటీ రోడ్ మీదుగా కోమల విలాస్ సెంటర్, రమణయ్య కూల్ డ్రింక్స్ సెంటర్, ఐరన్ సెంటర్, కొత్తగుళ్ళు మీదుగా రథం సెంటర్‌కు చేరుకుంది. మరలా అక్కడ నుండి కెనాల్‌రోడ్ వినాయకుని గుడి వద్ద నుండి తిరిగి కెనాల్‌రోడ్, బొడ్డు బొమ్మ సెంటర్ మీదుగా దుర్గా ఘాట్‌కు చేరుకుది. అక్కడ కృష్ణమ్మకు పంచహారతులను ఘనంగా నిర్వహించారు. ఈ ఊరేగింపులో సెక్షన్ అధికారి ఎన్ రమేష్, లక్ష్మణరావు, కమిటీ ధర్మకర్త పద్మశేఖర్, చనుమోలు సాంబ సుశీల, దేవస్థానం సహాయ ఈవో విజయ్‌కుమార్, తిరుమలరావు, పర్యవేక్షణాధికారి శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీమల్లిఖార్జున మహామండపం 7వ అంతస్తులో కనకదుర్గా నృత్యమందిర్ ఆధ్వర్యంలో నృత్యగురువు వై అనూరాధ ఆధ్వర్యంలో 17మంది కళకారులు శ్రీ ప్రార్థనా గీతం, సంగీత సామ్రాజ్య, వచ్చెను అలాయేలు మంగమ్మ, అష్టలక్ష్మీ, జగడపు చనుముల జాతర, మరకతమణిమాయ, దశావతాతారాలు, తదితర కళరూపాలను ప్రదర్శించారు. ఈసందర్భంగా కళాకారులను ఈవో కోటేశ్వరమ్మ ప్రత్యేకంగా అభినందించి ప్రత్యేక ప్రసాదాలను అందచేయగా ఇన్‌చార్జ్ పీఆర్వో కే బలరామ్ ఆదేశాలతో సెక్షన్ సహాయకుడు రత్నారెడ్డి కళాకారులకు అమ్మవారి దర్శనం చేయించారు.