కృష్ణ

ధనుంజయ హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (లీగల్), మే 30: అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత దిడ్ల ధనుంజయ హత్య కేసులో ఐదుగురి నిందితులకు జీవిత ఖైదు, రూ.2వేలు జరిమానా విధిస్తూ పదవ అదనపు జిల్లా జడ్జి జి స్వర్ణలత సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం పులిగడ్డ గ్రామానికి చెందిన దిడ్ల ధనుంజయను విజయ భాస్కర కో-ఆపరేటీవ్, కనెక్టవెటీ ఫ్రెషింగ్ సొసైటీ భూముల వివాదమై 2009 జూలై 7న అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు ఇనుపరాడ్లతో కొట్టి చంపారు. దీనిపై అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 24 మందిని ముద్దాయిలుగా చేర్చగా వీరిలో ఆరిక లోకేశ్వరరావు, మాతంగి పూర్ణచంద్రరావు, దాసరి వెంకట రమణ, మెట్టా రమేష్, దాసరి వెంకయ్యలపై నేరం ఋజువు కావటంతో న్యాయమూర్తి వారికి జీవిత ఖైదు, రూ.2వేలు జరిమానా విధించారు. శిక్ష పడిన ఐదుగురు పులిగడ్డ గ్రామానికి చెందిన వారు. మొత్తం 24 మంది సాక్షులను విచారించారు.