కృష్ణ

చైతన్య స్ఫూర్తితో ‘నవ నిర్మాణ దీక్ష’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 30: నవ చైతన్య స్ఫూర్తిని కల్పించే విధంగా జూన్ 2న రాజధాని నగరమైన విజయవాడ బెంజ్ సర్కిల్‌లో నవ నిర్మాణ దీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నవ చైతన్యాన్ని సమాజానికి అందించాలన్న దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కోరారు. 2న నవ నిర్మాణ దీక్షతో పాటు ఏడు రోజుల పాటు వివిధ అంశాలపై కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టామన్నారు. 8న భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర పురోభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవిరళ కృషి సల్పుతున్నారన్నారు. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడే విధంగా అద్భుతమైన రాజధాని నిర్మాణంతో పాటు నదుల అనుసంధానం ద్వారా డెల్టా, రాయలసీమ బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా కేంద్రంపై వత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. విభజన, వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న నీటి సమస్యను అధిగమించేందుకు, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని నీరు-చెట్టు పథకం కింద పెద్ద ఎత్తున నీటి కుంటలు, ఇంకుడు గుంటల తవ్వకాలు చేపట్టామన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరుతోందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున నీటి కుంటల్లో నీరు చేరి కొంత మేర మంచినీటి అవసరాలను తీర్చినట్లు తెలిపారు. బందరు మండలంలో నీరు చెట్టు కింద రూ.25.73కోట్లతో చెరువులు, మేజర్ డ్రైన్స్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. గత యేడాది ఉపాధి హామీ పథకం కింద రూ.5.19కోట్లు ఖర్చు చేయగా ఈ యేడాది మరో రూ.6కోట్లు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర నాయకులు కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య), బూరగడ్డ రమేష్ నాయుడు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జడ్‌పిటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి నాయకులు ఇలియాస్ పాషా, కుంచే దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.