కృష్ణ

6.5 కోట్లతో ఆలయాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఏప్రిల్ 3: ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాలకు విజయవాడ నుంచి నాగాయలంక వరకు తీరం వెంబడి ఉన్న 86 ఆలయాలను రూ.6.5కోట్లతో అభివృద్ధి చేయనున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ డీఈ దుర్గేష్‌కుమార్ తెలిపారు. మండలంలోని రొ య్యూరు, వల్లూరుపాలెం, తోట్లవల్లూరు, చాగంటిపా డు, దేవరపల్లి, ఐలూరు పుష్కర ఘాట్లను ఆదివారం ఏఈ డిఎన్ కుమార్, సిద్ధాంతి సతీష్, ఇన్స్‌పెక్టర్ సుజన్, ఆర్సీ ఏఈ శ్రీనిత్యతో కలిసి ఆయన పరిశీలించారు. వల్లూరుపాలెం వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు పిండప్రదానాలు చేసుకోటానికి చప్టాలు ఎక్కడ నిర్మించాలో పరిశీలిస్తున్నామని చెప్పారు. ఏ ఘాట్‌కు ఎందరు వస్తారో అంచనా వేసుకుని చప్టాలు నిర్మిస్తామన్నారు. ఆలయాలను రూ.6.5 కోట్లతో ఆధునీకరించి భక్తులు దైవదర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈ తెలిపారు. త్వరలోనే ఆలయాల అభివృద్ధి పనులు మొదలవుతాయని తెలిపారు. దేవాదాయ శాఖ ఈఓ నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ పి అప్పన్నకుమార్, విఆర్‌ఓలు డి నాగేశ్వరరావు, మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.