కృష్ణ

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: మార్కెట్ యార్డులో రైతులు అమ్మకానికి తెచ్చిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించి రైతులనుండి సమస్యలను అడిగి తెలసుకున్నారు. కొనుగోళ్ళను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకూ 124 మంది రైతుల నుండి 16,702 క్వింటాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేయటం జరిగిందన్నారు. ఇందుకు గానూ 2.95కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చిందని ఇందులో 70 మంది రైతులకు 1.45 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించటం జరిగిందని మిగిలిన 54 మంది రైతులకు త్వరలోనే చెల్లింపులు చేయటం జరుగుతుందన్నారు. పట్టిసీమ పుణ్యమా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం విద్యుత్‌ను అందించిన ఫలితంగా రైతులు ఈ ప్రాంతంలో రెండో పంట వేసుకుని ధాన్యాన్ని పండించారన్నారు. నాగార్జున సాగరు జలాలు ఇప్పటికీ చెరువులలో ఉండటం వల్ల తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు లేవన్నారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తెస్తే అకాల వర్షం వారిని కలవరానికి గురి చేసిందన్నారు. ఐనప్పటికీ సిబ్బంది, తమ పార్టీ కార్యకర్తలు, నేతలు, యార్డు చైర్మన్, పాలకవర్గ సభ్యులంతా రైతులకు పరదాలు అందించి ధాన్యాన్ని కాపాడారన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒక్క గింజ కూడా మిగల్చకుండా అన్నింటినీ కొనుగోలు చేయటం జరుగుతుందన్నారు. ఇంకా యార్డులో ఐదువేల క్వింటాళ్ళ ధాన్యం ఉందని, ముఠా కార్మికులను పెంచి రాత్రి, పగలు తేడా లేకుండా కొనుగోళ్ళను ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యం నిల్వలను దళారులకు అమ్ముకోకుండా మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకుని మద్దతు ధర పొంది లాభం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యార్డు చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు, పాలకవర్గ సభ్యులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

శంకుస్థాపనకు నోచుకోని నాట్యారామం

కూచిపూడి, ఏప్రిల్ 24: నాట్యక్షేత్రం కూచిపూడిలో రూ.100 కోట్లతో నాట్యారామం నిర్మిస్తున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు గడచినా ఇప్పటి వరకు కనీసం శంకుస్థాపన కూడా చేపట్టకపోవటం పట్ల కూచిపూడి నాట్యాచార్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా నాట్యారామ నిర్మాణంలో భాగంగా స్థానిక వేదాంతం వారి ధర్మచెరువులో రూ.10కోట్లకు పైగా అంచనాలతో నాట్య పుష్కరిణి నిర్మాణాన్ని ప్రారంభించి రెండు సంవత్సరాలు గడచినా నేటికీ ఒక రూపుదాల్చకపోవటం విశేషం. గత ఏడాది ఏప్రిల్ నెలలో రూ.20కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం వాస్తవ రూపం దాల్చకపోవటంతో నాట్య పుష్కరిణి నిర్మాణంపై నీలి నీడలు పడుతున్నాయి. పశువుల చెరువుగా ఉపయోగపడుతున్న ఈ చెరువులో నీటిని తోడేసి పాల రాతితో పుష్కరిణి మెట్లు నిర్మాణం చేపట్టారు. అది కూడా పూర్తి చేయకపోగా ప్రహరీగోడ నిర్మాణం కూడా అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఆ గ్రామంలోని చిన్న, సన్నకారు రైతులు పశువులు తాగేందుకు నీరు దొరకగా బోర్లు ద్వారా సమస్యను అదిగమిస్తున్నారు. గతంలో ఈ వేసవిలో చెరువు నిండా నీరు ఉండటంతో తమ పశువులకు పూర్తి స్థాయిలో నీరు అందేవని రైతులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాగ్ధానం చేసినట్లుగా రూ.100కోట్ల నాట్య పుష్కరిణి శంకుస్థాపనకు నోచుకోగా నిధులు కూడా సక్రమంగా కేటాయించకపోవటంతో అసంపూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా నిధులు త్వరితగతిన విడుదలచేసి నాట్య పుష్కరిణి నిర్మాణాన్ని అయినా పూర్తి చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నించాలని నాట్యాచార్యులు, కళాకారులు కోరుతున్నారు.