కృష్ణ

జనానికి ‘మినరల్స్’ టోపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: మినరల్ వాటర్ అంటే స్వచ్ఛమైన శుద్ధజలం... మినరల్స్‌తో కూడిన మంచి నీరని అర్థం. ఇది ఒకప్పటి మాట. కానీ నేటి ‘మినరల్ వాటర్’లో ‘మినరల్స్’ మచ్చుకైనా కానరావడం లేదు. కొన్ని కంపెనీల ‘మినరల్ వాటర్’ కొనడం అంటే ‘రోగాలను కొని తెచ్చుకోవడమే’ అవుతుంది. ఎంతసేపూ వారి నీటి వ్యాపారమే గానీ, మచ్చుకైనా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. మూడు లీటర్లు.. ఆరు సీసాలుగా ‘నీళ్ల వ్యాపారం’ వర్థిల్లుతోంది. ఈ వ్యవహారంపై అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా కూడా లేకపోవడంతో వారు ఆడిందే ఆట... పాడిందే పాటగా కాసులు మూటగట్టుకుంటున్నారు. ఒకప్పుడు బావులు, చెలమలు, కుంటల్లోని నీటిని తాగేవారు. అప్పుడు ఎంత వయసు వచ్చినా అందరూ ఆరోగ్యంగానే ఉండేవారు. ఆ తర్వాత బోర్లు, చేతిపంపులు, కుళాయిలు వచ్చాయి. ఈ నీళ్ళు తాగినంత వరకూ కూడా ఆరోగ్యంగానే జీవించారు. మారుతున్న కాలంతోపాటు సాంకేతికత పెరిగింది. నేడు ఎక్కువ శాతం మంది ‘ఆరోగ్యం’ పేరిట మినరల్ వాటర్ తాగుతున్నారు. వాస్తవంగా నిపుణులు చెబుతున్న ప్రకారం మినరల్ వాటర్ తాగితే గతంలో కంటే మరింత ఆరోగ్యంగా ఉండాలి. కానీ నేడు ఆరోగ్యంగా ఉండకపోగా, రోగనిరోధక శక్తి తగ్గి రోగాలను ‘కొని’ తెచ్చుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ‘మినరల్ వాటర్’లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడమే. మినరల్ వాటర్‌ను నిర్థిష్టమైన ప్రమాణాలతో క్లోరినేషన్ చేసి, ఫ్లోరైడ్‌ను వేరు చేసి, వీటిలో అవసరమైన వరకూ మినరల్స్‌ను కలపాలి. మినరల్ వాటర్ తయారీ నీటిని తీసుకునే బోరుబావులు కూడా సెప్టిక్ ట్యాంకుల పక్కన కాకుండా నిర్ణీతమైన దూరంలో ఉండాలి. కానీ జి.కొండూరు మండలంలో ఈ ప్రమాణాలు, నియమ, నిబంధనలు చాలామంది పాటించడం లేదు. దీంతో ప్రజలు అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే అవుతోంది. జి.కొండూరులో గతంలో నాణ్యత పాటించని ఒక వాటర్ తయారీ యూనిట్‌ను నిలిపివేశారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల పర్యవేక్షణ కూడా నేతిబీరకాయలో నెయ్యి చందంగా మారింది. అధికారులు సైతం ‘మనకెందుకులే’ తరహాలో మినరల్ వాటర్ ప్లాంట్లు, కూలింగ్ వాటర్ల నాణ్యత గురించి పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. వైద్యఆరోగ్య శాఖ, పంచాయితీ రాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని పలువురు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.