కృష్ణ

రహదారి విస్తరణకు మా స్థలాలు ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూన్ 2: రహదారి విస్తరణకు తాము విలువైన తమ స్థలాలు ఇవ్వలేమని మండలంలోని వెల్వడం గ్రామస్తులు తెగేసి చెప్పారు. ఈమేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మైలవరం నుండి నూజివీడు వరకూ రహదారిని 25కోట్ల రూపాయల వ్యయంతో విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మండలంలోని వెల్వడం, చంద్రాల గ్రామంలో కొన్ని ఆక్రమణలను ఇప్పటికే అధికారులు తొలగించగా కొన్నిచోట్ల ఇళ్లు అడ్డుగా ఉన్నాయి. ఇవి పక్కా ఇళ్లయినా ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం సంబంధిత యజమానులకు మార్కెట్ ధర ప్రకారం సొమ్ము చెల్లించి తొలగించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇటీవల తహశీల్దార్ కార్యాలయంలో యజమానులను పిలిపించి తహశీల్దార్ వారితో చర్చలు జరిపారు. కానీ వారు మాత్రం ప్రభుత్వం ఇస్తానన్న ధరకు తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్ ధరకు ప్రభుత్వం ఇస్తానన్న ధరకు పొంతన లేదని, అనేకచోట్ల కట్టడాలు కూడా నిర్మితమై ఉన్నాయని, వాటికి కూడా ధర లెక్కకట్టి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈమేరకు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేసినట్లు వివరించారు.