కృష్ణ

మన అంగన్‌వాడీ పిలుస్తోందని ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూన్ 2: మన అంగన్‌వాడీ పిలుస్తోంది కార్యక్రమంపై గురువారం మైలవరంలో ర్యాలీ జరిగింది. స్థానిక పంచాయితీ కార్యాలయం నుండి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, కిషోర బాలికలతో ర్యాలీ ప్రారంభమై మైలవరం పుర వీధులలో తిరిగింది. మన అంగన్‌వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా గురువారం అన్ని సెంటర్ల ఆధ్వర్యంలో ర్యాలీలు, 3న గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఐదు ఏళ్ళు నిండిన పిల్లలకు ప్రీ స్కూల్ సర్ట్ఫికెట్సు ఇవ్వటం, ఆరోగ్యంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవార్డు ఇవ్వటం, 4న సెంటర్స్ పరిధిలోని గర్భిణీ స్ర్తిలకు ఐఐఏ టాబ్లెట్స్ పంపిణీ, గుడ్లు, పాలు, కాల్షియం, వేరుశెనగ పప్పు ఉండలు అందించటం, పోషకాహారం తయారు చేసి ప్రదర్శించటం, 6నుండి 8వరకూ ప్రీ స్కూల్ ఎగ్జిబిషన్, ప్రీ స్కూల్ ఏక్టివేషన్, మంచి అలవాట్లు నేర్పించటం, 9,10 తేదీలలో అంగన్‌వాడీ పిల్లల ఇళ్ళకు వెళ్ళి వారికి కౌన్సిలింగ్ ఇవ్వటం, 13నుండి 15వరకూ అంగన్‌వాడీలో చేరిన పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించటం జరుగుతుందని మైలవరం ప్రాజెక్ట్ అధికారిణి లలితకుమారి వెల్లడించారు.