కృష్ణ

యోగ సాధకుడు హనుమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), జూన్ 2: హనుమ యోగ సాధకుడని ప్రముఖ సాహితీవేత్త, ఆర్ష విద్యాసాగర మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి అన్నారు. స్థానిక బచ్చుపేట శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న హనుమజ్జయంతి వేడుకల్లో భాగంగా 3వ రోజైన గురువారం ఆయన హనుమత్ వైభవంపై ప్రసంగించారు. సాధనలో ఎదురయ్యే అన్ని విఘ్నాలను జయించే విధానాన్ని ఆచరణ ద్వారా ప్రబోధించిన యోగి పుంగవుడు ఆంజనేయుడన్నారు. సత్యానే్వషణ ఆత్మదర్శన సాధన అని, మైనాకుడు, సురస, సింహికలు సత్వ, రజ, తమో గుణ సంబంధమైన విజ్ఞానాలకు ప్రతీకలని, వాటిని సౌమ్య వచనాలతో, యుక్తి, శక్తితో జయించిన సాధకుడు హనుమ అన్నారు. కార్యసాధకులకు, సేవాతత్పరులకు ఆయన ఆదర్శమన్నారు. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మసౌందర్య ప్రధానమని ఆయన వివరించారు. ఉదయం స్వామివారికి నాగవల్లి దళార్చన (తమలార్చన) నిర్వహించారు.