కృష్ణ

విజయ డెయిరీ చైర్మన్‌గా చలసాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక్కరోజు ముందు గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ విజయం సాధించారు. విజయ డెయిరీ చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు పేరును వంశీ ప్రతిపాదించగా గెలుపొందారు. విజయ డెయిరీ చైర్మన్ మండవ జానకీ రామయ్య అనారోగ్య కారణంగా రాజీనామా చేయగా ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో వంశీ స్పందించి సీఎం చంద్రబాబు వద్ద ఉన్న తన ప్రాధాన్యతను ఉపయోగించి రాజకీయ చతురతతో ఎన్నికయ్యే విధంగా పరిస్థితులు కల్పించారు. ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న డాక్టర్ వెంకటబాలవర్ధనరావు విశ్వ ప్రయత్నాలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి స్వస్తి చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్న దాసరి బ్రదర్స్ యత్నాన్ని వంశీ దెబ్బతీస్తు చలసాని ఆంజనేయులును విజయ డెయిరీ చైర్మన్ పీఠంపై అధిష్టింప చేయడంలో పట్టు నిలుపుకున్నారు.

‘దివి’సీమ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ

నాగాయలంక, మే 22: గత నెల 11న శాసనసభ, లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి నేడు జరుగు ఓట్ల లెక్కింపు సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన అభ్యర్థుల భవితవ్యంపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. గతంలో జరిగిన అనేక ఎన్నికలలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికలలో ప్రజలు ఏ రాజకీయ పక్షం వైపు మొగ్గు చూపారన్న విషయంలో ఇటు రాజకీయ పక్షాలకు చెందిన నేతలకే గాక, రాజకీయ విశే్లషకులకు సైతం అంతుపట్టని విధంగా ఉంది. ముఖ్యంగా అధికార (తెలుగుదేశం) పార్టీకి చెందిన అభ్యర్థిగా పోటీ చేసిన రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గెలుపు తధ్యమన్న ధీమాతో ఆ పార్టీకి చెందిన శ్రేణులలో ఉన్నప్పటికీ ఆయన గెలుపు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ముత్తంశెట్టి కృష్ణారావు పొందే ఓట్ల శాతాన్ని బట్టి ఉంటుందని విశే్లషకులు భావిస్తున్నారు. ఇక ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబు వీరిరువురికి గట్టిపోటీ ఇచ్చినట్లు భావిస్తున్నారు. వీరే కాక ఈ నియోజకవర్గంలో బీజెపీ, కాంగ్రెస్, ప్రజాశాంతి, ఫార్‌వాడ్‌బ్లాక్ పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా పోటీ చేసినప్పటికీ ప్రధాన పోటీ మొదటి మూడు పార్టీలకు చెందిన అభ్యర్థుల మధ్యే నెలకొన్నదన్నది బహిరంగ రహస్యం. అభివృద్ధి, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని దేశం పార్టీకే ఓటు వేస్తారన్న ఆశతో టీడీపీ వర్గాలు ఉండగా, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు వైకాపా వైపు మొగ్గుచూపారన్న ధీమాతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు. జనసేన అభ్యర్థికి కాపు సామాజిక వర్గం నుంచి అత్యధిక ఓట్లు పొందే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయకేతనం ఎగుర వేస్తారన్నది మరో కొద్ది గంటల పాటు ఎదురుచూడాల్సిందే.